Groom Run Away: పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా మొదటి భార్య కన్పిస్తే ఎలా ఉంటుంది. రెండో పెళ్లి దొంగ పెళ్లైతే అంతకుమించి షాక్ ఉండదు. అదే జరిగింది. అచ్చం సినిమాలో జరిగినట్టే..ఏం జరిగింది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లోని మొయిన్ బాగ్, మాదన్నపేటలో జరిగింది ఈ ఘటన. పెళ్లి తరువాత జరిగే రిసెప్షన్ జరుగుతోంది. హఠాత్తుగా రిసెప్ఠన్‌లో పెళ్లికొడుకు తన మొదటి భార్యను చూశాడు. అంతే..ఏం చేయాలో అర్ధం కాలేదు. అక్కడ్నించి లగెత్తాడు. పలాయనం చిత్తగించాడు. ఆ వివరాలు మీ కోసం..


సయ్యద్ నజీర్ రెండవ పెళ్లి చేసుకుని..గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నాడు. అంతే అక్కడికి మొదటి భార్య డాక్టర్ సనా సమ్రీన్‌ను పోలీసులతో చూశాడు. అంతే ప్యానిక్ అయిపోయాడు. దొంగ పెళ్లి కదా మరి. అంతే రేర్ ఎంట్రన్స్ ద్వారా అక్కడ్నించి పరారయ్యాడు. భర్త తను అనుమతి లేకుండా రెండవ పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకుని సోదరుడు అబ్దుల్ వహీద్, సంతోష్ నగర్ పోలీసులతో రిసెప్షన్ ప్రాంగణానికి చేరుకుంది. అక్కడ ఈమెను చూడగానే ఆ పెళ్లి కొడుకు పారిపోయాడు.


సయ్యద్ నజీర్ న్యూజిలాండ్ నుంచి రాగానే..2019లో డాక్టర్ సనా సమ్రీన్‌తో వివాహమైంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా అతడిక్కడ స్టక్ అవడంతో అతడి ఖర్చులన్నీ సోదరుడే భరించాడు. అంతేకాకుండా 15 లక్షల డిమాండ్ చేశాడని..అదివ్వలేకపోవడంతో తన సోదరిని దూరం పెట్టేవాడని అబ్దుల్ వహీద్ తెలిపాడు.


డబ్బుు కోసం వేధిస్తున్నాడని ఇప్పటికే డాక్టర్ సనా సమ్రీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తానొక డాక్టర్ అయినందున..కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో..కరోనా సోకిన తన భర్త మావయ్యకు సేవలందించడమే కాకుండా దాచుకున్న డబ్బులన్నీ ఖర్చుపెట్టినట్టు డాక్టర్ సమ్రీన్ వెల్లడించింది. రిసెప్టెన్ నుంచి పరారైన పెళ్లికొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


Also read: Thief Viral Video: ఇదేం పాడుబుద్దిరా అయ్యా.. అవి దొంగతనం చేసి ఏం చేసుకుంటావ్! విషయం తెలిస్తే నవ్వులే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook