Cat Rat Funny Video, Lucky Rat escapes from Cat: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని అందరికీ షాక్ ఇస్తుంటాయి. ఇంకొన్ని వీడియోస్ మాత్రం నవ్వును తెప్పిస్తాయి. ఇలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఎలుక మరియు పిల్లి మధ్య జరిగే పోరాటానికి సంబంధించినది. వీడియో చూస్తే వావ్ అనక మానరు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. బాత్‌రూమ్‌లో ఎలుక కోసం ఓ బుల్లి పిల్లి మాటువేసి కూర్చుంటుంది. పెద్ద ఎలుక లోపలికి రాగానే..  బాత్‌రూమ్‌లో ఉన్న వ్యక్తి తలుపు మూసేస్తాడు. దాంతో పిల్లిని చూసిన ఎలుక భయంతో పారిపోయే ప్రయత్నం చేస్తుంది. అయితే డోర్ క్లోస్ అవ్వడంతో.. వెంటనే ఎలుకపై పిల్లి దాడి చేస్తుంది. ఎలుక తప్పించుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఎలుక తోకను పిల్లి పట్టుకోవడంతో దానికి ఏం చేయాలో అర్ధం కాదు. ఆ అయోమయంలో ఎలుక కూడా పిల్లిపై దాడి చేస్తుంది. చివరకు పిల్లి కాలును ఎలుక కొరకడంతో.. పిల్లి దాన్ని వదిలేస్తుంది. 



పిల్లి వదిలేయగానే ఎలుక పరుగందుకుంటుంది. చిరాకు ఎలుక ఓ డబ్బా పైకి ఎక్కడంతో పిల్లి కిందే ఆగిపోతుంది. ఈ తతంగాన్ని అక్కడున్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో బంధించడం విశేషం. ఈ పోరులో ఎలుక కేకలేస్తున్న శబ్ధం చాలా బాధాకరంగా ఉంది. ఈ వీడియోను క్యాట్స్‌క్లూబోఫుసా (catsclubofusa) అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.


Also Read: మూడు బంతుల్లో రెండు వికెట్లు.. సిరాజ్ దెబ్బకు షాక్‌కు గురైన వెస్టిండీస్ ఫాన్స్ (వీడియో)!


Also Read:  Goa Zuari River  Accident: గోవాలో నదిలోకి దూసుకెళ్లిన కారు..నలుగురు జల సమాధి..!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook