CBSE Results 2023 Viral Memes: నేడు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. పదో తరగతి ఫలితాలు వచ్చినా లేదా ఇంటర్మీడియెట్ ఫలితాలు వచ్చినా.. విద్యార్థుల పాస్, ఫెయిల్ స్టేటస్ కోసం, మార్కులు తెలుసుకోవడం కోసం వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యుల నుంచి మొదలుపెడితే.. ఇంటికి దూరంగా ఉన్న అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, పిన్ని, బాబాయిలు, దగ్గరి చుట్టాల నుంచి దూరం చుట్టాల వరకు.. స్నేహితుల నుంచి శ్రేయోభిలాషుల వరకు వరుసగా ఫోన్లు చేసి ఎంక్వైరీలు మొదలుపెడతారు. మీ వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి, మీ అమ్మాయికి ఎంత గ్రేడ్ వచ్చిందంటూ ఆరా తీస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఏ బోర్డు ఎగ్జామినేషన్స్‌ ఫలితాలు వెలువడినా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రోజు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో 12వ తరగతి విద్యార్థుల రియాక్షన్ ఎలా ఉంటుంది ? వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వైరల్ మీమ్స్ చూస్తే మీరు కూడా కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం. అవేంటో మీరే ఓ లుక్కేయండి మరి.


బోర్డ్ ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు కాబట్టి ఫలితాలు కూడా కచ్చితంగా బాగుండవు అని భయపడే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారంతా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని అనుకుంటుంటారని చెబుతూ బోజ్‌పురి నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ మూవీకి చెందిన ఒక స్క్రీన్ షాట్‌తో ఒక మీమ్ వైరల్ అవుతోంది. అది చూస్తే మీరు కూడా నవ్వాపుకోలేరు.


3 ఇడియట్స్ మూవీ క్లైమాక్స్ సీన్ లో ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే సందర్భంలో నటుడు శర్మన్ జోషి రియాక్షన్ ని ఉపయోగించి చేసిన మరో మీమ్ కూడా అంతే వైరల్ అవుతోంది. 


ఇంటికి ఫోన్ చేసే చుట్టాల గురించి ఒకే ఒక్క ఇమేజ్ ఉపయోగించి చేసిన మీమ్ చూస్తే క్రియేటర్ ప్రతిభకి సలాం చెప్పాలనిపిస్తుంది చూడండి.