Chinas Most Mysterious Horror Story: చైనీయులు పాటించే చంద్రమాన క్యాలెండర్ లో ఏడో నెల ఘోస్ట్‌ మాసం ''గుయ్యొయి'' . ఈ నెలలో స్వర్గ, నరక ద్వారాలు తెరుచుకుంటాయని చైనీయులు నమ్ముతారు. భూమి మీదకు దైయ్యాలు, ఆత్మలు వచ్చి వేళ్లే కాలంగా వారు చెబుతారు. సుమారుగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వస్తుంది చైనా వాళ్ళ ఏడవ నెల. ఈ నెలలో ఆత్మలు, దెయ్యాలు, భూతాలు గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు.  ప్రతిఒక్కరు వారి అనుభవాలను ఇతరులతో పంచుకుంటారు. ఈ నెలంతా అంటే తిరిగి స్వర్గ, నరక ద్వారాలు మూసుకునే వరకు ప్రతిఒకరు వారికి జరిగిన సంఘటనల గురించి చర్చిస్తుంటారు. అయితే చైనావాళ్ళు చెప్పే ఈ కథలకు ఎలాంటి ఆధారాలు లేవు కానీ వారి వారి నమ్మం ఒక్కటే వీటి ప్రాచూర్చానికి కారణం అని చెప్పవచ్చు. అయితే వారి కథనాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక కథ గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1995 నవంబర్‌ 14న ఓ ఘటన చోటు చేసుకుందని అక్కడ జనాలు చెబుతుంటారు. ఆ రోజున ద లాస్ట్‌ బస్‌ టు ఫ్రాంక్ రన్‌ హిల్స్ అనే బస్ నెంబర్ 375 గురించి చెప్పే కథ ఇది. జరిగిన దుర్ఘటన అయితే కంటికి కనిపించినప్పటికి ఇది ఎలా జరిగింది? అనే వివరాలు ఇప్పటికి ఎవరికి తెలియదు. ఈ ఘటనపైన ఇన్వెస్టిగేషన్‌ చేసినప్పటికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే ఈ కథ ఎందుకు ఎంత ఫేమస్‌?  యువాన్ మింగ్ యువాన్‌ బస్‌ టర్మినల్ నుంచి బయలుదేరి చివరి బస్‌ జియాంగ్‌ షాన్‌కి చేరుకోవాలి. ఆ గమ్యమే ఫ్రాంగ్‌ అట్‌ హిల్స్‌ మెయిల్‌ డ్రైవర్‌ మహిళా కండక్టర్‌ ఆ బస్సులో ఉన్నారు. ఆ రాత్రి విపరీతమైన చలిగా ఉంది. ఫ్రాంగ్ అట్‌ హిల్స్‌కి బయలుదేరిన బస్‌ నెంబర్‌ 375 సమ్మర్‌ ప్యాలెట్‌ సౌత్‌ గేట్స్‌ స్టాప్‌లో ఆగినప్పుడు అక్కడ ఒక ముసలామె, ఒక యువజంట, ఒక యువకుడు ప్రయాణికులు ఎక్కారు.  ఆ రాత్రి ఆ ప్రయాణం కేవలం 16 km మాత్రమే. అయితే ఎక్కిన యువజంట ముందు సీట్లో డ్రైవర్ వెనక కూర్చున్నారు. ముసలామే, యువకుడు తలుపు పక్క ఉన్న  ఎదురు బదురు సీట్లలో కూర్చున్నారు. రోడ్‌ మీద ఈ బస్‌ తప్ప మరో బస్‌ లేదు. రాత్రి 2.00లకు బయట విపరీమైన మంచు కురుస్తుంది.


దీంతో ఆ డ్రైవర్ వేరే దారిలో వెళ్దామా అని ముసలామే, యువకుడిని అడిగారు దీంతో వారు సరే అని చెప్పారు. కానీ యువజంట మాత్రం దీనికి ఒప్పుకోలేదు. వారు మలుపు దగ్గర దిగాల్సి ఉంది వారు అక్కడే దిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఇద్దరు ప్రయాణికులతో డ్రైవర్‌, కండక్టర్లు పక్క దారిలో బయలుదేరారు. ఇంతలో అక్కడ క్రీచమని శబ్దం చేస్తూ బస్సు ఆగింది. ఎదురుగా ముగ్గురు వ్యక్తులు ఉన్నరు. వారు చెయ్యెత్తి బస్‌ ఆపమని సెగలు చేస్తారు. ఆ ముగ్గురు బస్‌ ఎక్కారు. వారు చూడ్డానికి సాధారణంగానే ఉన్నప్పటికి వాళ్ళ వేషధారణ సాంప్రదాయ తరహాలో ఉన్నాయి. ఈ దుస్తుల మీద బాగా మట్టి కొట్టుకుపోయినట్టు, మాసిపోయి ఉన్నాయి. అయితే ఎక్కిన ముగ్గురిలో ఇద్దరు మూడో మనిషిని భుజాలు, నడుము పట్టుకొని బస్‌ ఎక్కించారు. మధ్యలో ఉన్న వ్యక్తి తల క్రిందకి వేలాడేసి కూర్చున్నాడు. ఆ ముగ్గురిని చూసిన ముసలావిడ మాత్రం భయంతో వారివైపు చూసూ ఉన్నారు. ఇంతలోకి బస్‌ మెయిన్ రోడ్‌ లోకి మళ్ళింది. ఇంతలో ముసలావిడ పర్స్‌ కింద పడింది. దీంతో ఆవిడ పర్స్‌ తీసుకొని తన పక్కన ఉన్న యువకుడితో గొడవ పెట్టుకొని ఇద్దరు బస్‌ దిగారు. ముసలావిడ యువకుడితో తన చూసిన విషయం గురించి చెప్పింది. బస్‌లో ఉన్నవారు మనుషులు కాదు పిశాచాలు అని. వారీకి పాదాలు లేదని చెప్పింది. దీంతో వారు ఇతరలు గురించి ఆలోచించి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి జరిగిన సంఘటన గురించి చెప్పారు.  కానీ పోలీస్‌లు వారి మాటలు నమ్మలేదు. 


ఇక చేసేది ఏమిలేక ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మర్నాడు జరిగిన సంఘటన ప్రతిఒక్కరిని భయంకు గురించేసింది. 1995 నవంబర్‌ 14న బస్‌ నెంబర్‌ 375 డిపోకు చేరుకోలేదు. నవంబర్ 15న క్లూస్‌ టీం సెర్చ్‌ పార్టీని పంపించింది. ఆ రోడ్ దగ్గర ఉన్న కెమెరాలో బస్‌ కనిపించింది. ఆ తరువాత దారీలో ఉన్న కెమెరాల్లో బస్ కనిపించలేదు. రెండవ రోజు ఫ్రాంఘాట్ హిల్స్‌కి 100 కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తున్న ఒక నదిలో 375వ నెంబర్ బస్ మునిపోయి కనిపించింది. వియోన్‌ రిజర్వాయర్‌లో మునిగిపోయిన ఆ బస్సులో డ్రైవర్‌, కండక్టర్ మృతదేహాలతో పాటు గుర్తు తెలియని మగ మనిషి మృతదేహం ఉంది. సంఘటన జరిగి రెండు రోజు అయినప్పటికి అన్ని కుళ్ళిన దశలో ఉన్నాయి. దీంతో పోలిసులు తదుపరి చర్యలు తీసుకున్నారు. ఇందులో వారికి తెలిసిన విషయం ఏమిటి అంటే బస్ ఈ చెటు రాలేదు. పెట్రోల్‌ ట్యాంక్‌ తీసి చూస్తే అందులో రక్తం కనిపించింది. ఈ విషయం తెలిసిన జనాలు భయంతో వణికిపోయారు. ఇప్పటికి ఈ కథ చైనాలో ఓ అంతు చిక్కని కథలా మిగిలిపోయింది. 


Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.