China Corona Update: కరోనాకే కంగారు పుట్టించేలా.. దంపతుల సూపర్ ఐడియా.. వీడియో వైరల్
Chinese Couple Video: కరోనా మహమ్మారితో చైనాలోని ప్రజలు వణికిపోతున్నారు. రోజు లక్షల్లో కోవిడ్ బారిన పడుతుండడంతో భయాందోళన నెలకొంది. దీంతో కరోనా తమకు సోకకుండా దంపతులు ఓ సూపర్ ఐడియా వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Chinese Couple Video: కోవిడ్ -19 చైనాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కారణంగా చైనాలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు కరోనా బారిన పడుతున్నారు. అధికారికంగా చైనా తన రోజువారీ కేసుల డేటాను దాచిపెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చైనాలో ప్రతిరోజూ కోట్ల కొద్దీ కొత్త కేసులు వస్తున్నాయని అనేక మీడియా నివేదికలలో వెల్లడివుతోంది. దీంతో పాటు పెద్ద సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో భయానక వాతావరణం నెలకొంది.
బ్లూమ్‌బెర్గ్,ఏఎఫ్‌పీ సహా అనేక ఏజెన్సీలు చైనీస్ ఆసుపత్రులు, శ్మశానవాటికలో మృతదేహాలతో నిండి ఉన్నాయని నివేదించాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో అక్కడి ప్రజలు కోవిడ్ -19 వ్యాప్తిని ఎదుర్కోవటానికి చైనా ప్రజలు తమ సొంత పద్ధతులను అవలంబిస్తున్నారు. అందులో కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. కరోనా నుంచి తమను తాము రక్షించుకునేందు ఓ జంట తాత్కాలిక 'షీల్డ్'ని ఉపయోగించారు. ఈ జంట వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చైనా రాష్ట్ర అనుబంధ మీడియా పీపుల్స్ డైలీ పోస్ట్ చేసింది. ఇందులో ఒక జంట తమను తాము ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం నుంచి రక్షించుకుంటూ కూరగాయల కోసం షాపింగ్ చేస్తున్నట్లు ఉంది. వీడియోలో జంట తమను తాముపై నుంచి కిందకి ప్లాస్టిక్ షీట్‌లో కప్పుకుని.. గొడుగుతో పట్టుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ జంట ఉపయోగించిన ఈ షీల్డ్‌ను చూసి కొందరు నవ్వుతూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో కొంతమంది కరోనా భయాందోళనల ప్రభావాన్ని చెబుతున్నారు. ఈ వారంలో చైనాలో ఒక్కరోజే 37 మిలియన్ల కేసులు నమోదయ్యాయని ఏఎఫ్‌పీ నివేదిక పేర్కొంది. దేశంలో కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసినప్పటి నుంచి కేవలం ఆరు మరణాలు మాత్రమే నమోదయ్యాయని చైనా అధికారిక డేటా పేర్కొంది. కానీ వేలల్లో మరణాలు ఉన్నాయని మీడియా నివేదికలను బట్టి తెలుస్తోంది.
Also Read: బంగారం కంటే విలువైన మూలిక.. చైనా చొరబాటుకు అసలు కారణం వెలుగులోకి..!
Also Read: Team India: కొత్త ఏడాదిలో టీమిండియా ముందు ఈ 3 సవాళ్లు.. రోహిత్ సేన అధికమిస్తుందా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి