Vande Bharat Cockroach Incident: వేగంగా వెళ్లే రైలు అని భావించి వందే భారత్‌ రైలు ఎక్కిన ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. ప్రయాణ సమయంలో తినడానికి ఆర్డర్‌ చేసిన భోజనంలో బొద్దింక ప్రత్యక్షమైంది. రైల్వే శాఖ అందించిన భోజనంలో పురుగు రావడంతో తీవ్ర దుమారం రేపింది. బొద్దింకను చూసి అతడు తినలేకపోయాడు. వెంటనే బొద్దింకను, సరఫరా చేసిన ఆహారం ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి రైల్వే శాఖ స్పందించింది. మీకు అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. చెప్పిన మాట ప్రకారం భోజనం సరఫరా చేసిన వారికి రైల్వే అధికారులు జరిమానా విధించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ ప్రయాణికుడికి ఎదురైంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Fish Load Lorry: రోడ్డుపై విలవిలలాడిన చేపలు.. జాలి లేకుండా వాటిపైనే వెళ్లిన వాహనాలు


మధ్యప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ సుబేందు కేశరి ఈనెల 1వ తేదీన రాణికమలపాటి స్టేషన్‌ నుంచి జబల్‌పూర్‌ స్టేషన్‌ వెళ్లేందుకు వందే భారత్‌ రైలులో (20173 ఆర్‌కేఎంపీ టు జేబీపీ) ప్రయాణించారు. టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్న ఆయన దాంతోపాటు ఆహారం కూడా బుక్‌ చేసుకున్నాడు. ప్రయాణం మధ్యలో భోజనం రావడంతో తినడానికి సిద్ధమయ్యాడు. భోజనం పార్సిల్‌ తెరచి తింటుండగా ఆహారంలో బొద్దింక కనిపించింది. అది చూసి అవాక్కయ్యాడు. తిందామని చూస్తే పురుగులు పడిన భోజనం ఎలా చేయాలి? అని నిలదీశాడు. వాటికి సంబంధించిన ఫొటోలను తీసి రైల్వే శాఖకు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేశాడు. అతడి ట్వీట్‌ను చూసిన రైల్వే శాఖ స్పందించింది. 


'మీకు కలిగిన సంఘటనకు మా క్షమాపణలు. ఈ విషయాన్ని మేం తీవ్రంగా పరిగణించాం. సంబంధి సర్వీస్‌ ప్రొవైడర్‌కు భారీ జరిమానా విధించాం. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకున్నాం' అని ఐఆర్‌సీటీసీ తెలిపింది. జరిమానా విధించిన ఫొటోలను బాధితుడు పంచుకున్నాడు. కాగా.. ఈ సంఘటనపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరిగింది. రైల్వే శాఖకు భారీ కేటాయింపులు చేస్తున్నా ప్రయాణికులకు మాత్రం ఆ స్థాయిలో సౌకర్యాలు, సేవలు అందడం లేదు. దీంతో రైల్వే శాఖపై ప్రయాణికులతోపాటు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook