Crocodile Man Viral Video, Man playing with Crocodile in water: ఈ భూ ప్రపంచంలో ఎన్నో పెంపుడు జంతువులు ఉన్నాయి. కుక్క, ఆవు, గేదె, మేక, పిల్లి, కోడి, కుందేలు.. ఇలా ఎన్నో ఉన్నాయి. వాటితో మనం సరదాగా ఆడుకుంటూ ఉంటాం. ఎందుకంటే అవి మనకు ఎలాంటి హాని తలపెట్టవు. క్రూర మృగాలు సింహం, పులి, మొసలితో లాంటి వాటితో ఎవరైనా ఆడుకుంటారా?. వాటిని దూరం నుంచి చూసే ప్రాణ భయంతో ఆమడ దూరం పరుగెడుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏ మాత్రం భయం లేకుండా.. ఏకంగా మొసలితో ఆడుకున్నాడు. అంతేకాదు ఆహారం ఆశ చూపి దాన్ని కాసేపు ఆట కూడా పట్టించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ మొసలికి సంబందించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం... ఓ వ్యక్తి చిన్నపాటి సరస్సులో పడవలో వెళతాడు. మధ్యలో ఆగి అక్కడున్న మొసలిని పిలుస్తాడు. ఆ వ్యక్తి నీటిలో తన కాళ్లను పెట్టగా.. మొసలి అతడి కాళ్ల మధ్యలోకి వస్తుంది. అప్పుడు అతడు ఓ చేతితో మొసలిని పట్టుకుని.. మరో చేతిలో ఒక చిన్న మాంసం పట్టుకుంటాడు. మొసలి ఆ మాంసం ముక్కను అందుకునే ప్రయత్నం చేయగా.. ఆ వ్యక్తి అందకుండా చేతిని పైకి అంటూ ఆటపట్టిస్తాడు. అయినా కూడా ఆ మొసలి అతడిని ఏమీ అనదు.



చివరకు మొసలి నీరు తెరవగా.. ఆ వ్యక్తి ముక్కను దాని నోట్లో వేస్తాడు. అనంతరం దాని తలపై దువ్వగా.. అది అక్కడి నుంచి నీటిలోకి వెళ్ళిపోతుంది. ఏదేమైనా క్రూర జంతువు అయిన మొసలి అతనికి ఏ మాత్రం హాని కలిగించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వీడియోని ఫిజిన్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ అయింది. కేవలం 15 సెకన్ల ఈ వీడియోకు 1 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు లైక్, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'మొసలితో ఆడుకోవడం ఏంది సామీ' అని ఒకరు కామెంట్ చేయగా.. 'అతడు ట్రైనర్ అయి ఉంటాడు' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.


Also Read: నేను గెలిచినందుకు ఆనందమే కానీ.. అందుకు బాధగా ఉంది: పీవీ సింధు


Also Read: నెట్టింట జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్ వీడియోలు.. పోలీసులను ఆశ్రయించిన బాలిక తల్లిదండ్రులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook