Jubilee Hills gang rape Minor Girls parents approached Hyderabad Police: హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాయని 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లిదండ్రులు మహిళా భద్రతా విభాగం అధికారులను ఆశ్రయించారు. బాలికతో ఐదుగురు నిందితులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు, ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయని.. వాటిని వెంటనే తొలగించాలని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన రెండు నెలల తర్వాత కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.
తాజాగా మైనర్ బాలిక తల్లిదండ్రులు గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి.. నిందితులతో పాటు ఆమె రెండు వీడియోలు, ఫోటోలను ఇన్‌స్టాలో గమనించారు. ఒక ఫోటోలో బాలిక మెడపై గాయం గుర్తులు ఉండగా.. రెండవ ఫోటో మరియు రెండు వీడియోలలో నిందితులు బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు ఒక వీడియోలో అయితే బాలిక మరియు ముగ్గురు మైనర్ నిందితుల ముఖాలు స్పష్టంగా కనిపించాయి. బాధితురాలి ముఖం కనిపించే వీడియోను 2000 మందికి పైగా లైక్ చేశారు.
మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళా భద్రతా విభాగం ఈ కేసును హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులకు బదిలీ చేసింది. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు సంబందించిన వీడియోలు, ఫోటోలను వెంటనే తొలగించాలని ఇన్‌స్టా ఖాతాదారులకు నోటీసులు ఇచ్చారు. వీటిని ఎవరు అప్‌లోడ్ చేశారో సమాచారం తెలుసుకుని వారిమీద క్రిమినల్ కేసు పెట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ఇంతకుముందు ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేసిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారులపై సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేశారు.
2022 మే 28న హైదరాబాద్‌లో జరిగిన అత్యాచార ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్ నుంచి బయటకు తీసుకెళ్లిన మైనర్ బాలికపై సాదుద్దీన్ సహా మరో నలుగురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారం చేశారు. ఇన్నోవా కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జూన్ 2న బాలిక, నిందితుల వీడియోలు బయటకు వచ్చాయి. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు. మరోవైపు బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఈ కేసుకు సంబంధించిన వీడియోలను ప్రెస్ మీట్‌లో బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.
Also Read: జింబాబ్వే బ్యాటర్ బర్ల్ పెను విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 34 రన్స్! చిరిగిన బూట్లతో..
Also Read: Raksha Bandhan 2022: రాఖీ పండుగ ఆగస్టు 11 లేదా ఆగస్టు 12?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook