CWG 2022 PV Sindhu: నేను గెలిచినందుకు ఆనందమే కానీ.. అందుకు బాధగా ఉంది: పీవీ సింధు

PV Sindhu on Mixed Team competition at the Commonwealth Games. కామ‌న్‌వెల్త్ గేమ్స్‌ 2022 బ్యాడ్మింట‌న్ ఫైనల్ అనంతరం సింధు మాట్లాడుతూ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో తాను గెలవడం సంతోషంగా ఉందన్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 3, 2022, 01:35 PM IST
  • బ్యాడ్మింట‌న్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో భార‌త్‌కు ర‌జ‌తం
  • పీవీ సింధు మాత్ర‌మే
  • మనదికాని రోజున ఏదీ కలిసిరాదు
CWG 2022 PV Sindhu: నేను గెలిచినందుకు ఆనందమే కానీ.. అందుకు బాధగా ఉంది: పీవీ సింధు

Badminton player PV Sindhu says I was a bit sad missing the gold medal for India: కామ‌న్‌వెల్త్ గేమ్స్‌ 2022లో భార‌త బ్యాడ్మింట‌న్ మిక్స్‌డ్ జ‌ట్టు ప‌త‌కం సాధించింది. మ‌లేషియాతో జ‌రిగిన ఫైన‌ల్లో 1-3 తేడాతో ఓడిపోవడంతో భారత్ ర‌జ‌త పతకంతో స‌రిపెట్టుకుంది. భార‌త జ‌ట్టులో తెలుగు తేజం పీవీ సింధు మాత్ర‌మే మ‌హిళల సింగిల్స్‌లో గెలిచింది. మిగతా మూడింటిలో భారత ప్లేయర్స్ ఓడిపోవడంతో బంగారు పతకం సాధించే అవకాశం లేకుండా పోయింది. ఫైనల్ అనంతరం సింధు మాట్లాడుతూ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో తాను గెలవడం సంతోషంగా ఉందని, అయితే భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించనందుకు బాధగా ఉందన్నారు. 

'మలేషియా జట్టుపై గెలవడం అంత సులువేమీ కాదు. ఫైనల్‌లో ప్రతి మ్యాచ్ కీలకమే. జట్టుగా మేమంతా బాగానే ఆడాం. ఒక్కోసారి ఎంత కష్టపడినా మనదికాని రోజున ఏదీ కలిసిరాదు. నేను గెలిచి పాయింట్‌ ఇవ్వడం ఆనందంగానే ఉన్నప్పటికీ.. బంగారు పతకం సాధించలేకపోయిందుకు బాధ కూడా ఉంది. అయితే దీని నుంచి బయటకు వచ్చి వ్యక్తిగత పోటీలపై దృష్టిపెట్టాలి. వ్యక్తిగత పోటీల్లో 100 శాతం ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. పతకం సాధించడం ఈజీ కాదు. క్వార్టర్‌ఫైనల్స్‌లో మలేషియా క్రీడాకారిణితో ఆడాల్సి వస్తుంది. ఆపై సింగపూర్‌ ప్లేయర్‌తో తలపడాలి' అని పీవీ సింధు అన్నారు. 

బ్యాడ్మింట‌న్ మిక్స్‌డ్లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్‌లో (పురుషుల డబుల్స్‌లో) చిరాగ్ శెట్టి, సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డిలు ఓడారు. టెంగ్ ఫాంగ్‌, వూయి ఇక్ చేతిలో 21-18, 21-15 స్కోర్‌తో చిరాగ్-సాత్విక్‌ ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 22-20, 21-17తో జిన్‌ వీపై గెలిచి స్కోరును 1-1తో సమం చేసింది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 19-21, 21-6, 16-21తో జి యాంగ్‌ చేతిలో ఓడిపోవడంతో భారత్‌ 1-2తో వెనుకబడింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్‌-ట్రెసా జాలీ జోడీ 18-21, 17-21తో తిన్నయ-పియర్లీ ద్వయం చేతిలో పరాజయం పాలవడంతో.. మలేషియా 1-3తో గెలుపొందింది. 

Also Read: జింబాబ్వే బ్యాటర్‌ బర్ల్‌ పెను విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 34 రన్స్! చిరిగిన బూట్లతో..

Also Read: Raksha Bandhan 2022: రాఖీ పండుగ ఆగస్టు 11 లేదా ఆగస్టు 12?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News