Viral Video Of Little Girl: నేటి తరం పిల్లలు చిన్న వయసు నుండే ఎంతో తెలివైన వారుగా, సృజనాత్మకంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో వారి ప్రతిభను ప్రదర్శించడం చూసి జనాలు ఆశ్చర్యపోవాల్సిందే. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు కూడా పిల్లల సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఎక్కువగా కృషి చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా పిల్లలలోని ప్రతిభను బయటకు తెచ్చి, వారిని ప్రేరేపించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. పిల్లలు తమ డ్యాన్స్, సింగింగ్, డ్రాయింగ్, లేదా ఇతర నైపుణ్యాలను వీడియోలు, ఫోటోల రూపంలో పోస్ట్ చేసి, ప్రశంసలు పొందుతున్నారు.  నేటి తరం పిల్లలు తమలోని కళాకారుడిని, నటుడిని, గాయకుడిని, లేదా ఏదైనా ప్రత్యేకమైన నైపుణ్యాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రదర్శిస్తున్నారు.  ఇతరుల ప్రతిభను చూసి ప్రేరణ పొంది, తమలోని టాలెంట్‌ను మరింతగా పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను ప్రపంచానికి చూపించడం ద్వారా, పిల్లలు అనేక అవకాశాలను పొందవచ్చు. ఉదాహరణకు, స్కాలర్‌షిప్‌లు. ఈ తరహాలోనే ఓ నాలుగు సంవత్సరాల చిన్నారి కూడా తన అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో నెట్టిజన్లను  ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నారి చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో నెట్టింటా వైరల్‌గా మారింది. డ్యాన్స్‌ చూసిన నెట్టిజన్‌లు నోరు వెల్లబెడుతున్నారు. వివిరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియోలో ఓ 4 ఏళ్ల చిన్నారి " Tokni Mai Heera '' అనే పాటకు బుజ్జి బుజ్జి స్టెప్స్ తో ఆకట్టుకుంది. ఈ పాటు పాప ఇచ్చిన  ఎక్స్‌ప్రషన్స్ చూసిన నెట్టిజన్‌లు మురిసిపోతున్నారు. చిన్న హీరోయిన్‌గా ఉందని కామెంట్స్‌ చేశారు. ఇంత చిన్న వయసులోనే అంత అద్భుతమైన ఎక్స్‌ప్రషన్స్‌ ఇవ్వడం చాలా గ్రేట్‌ని మరి కొందరూ కామెంట్‌ చేశారు. ఈ డ్యాన్స్‌ వీడియో @aapkidishu  అనే ఇంస్టాగ్రామ్ ఎకౌంట్‌ పేరు మీద ఉంది. ఇది పాప ఇంస్టాగ్రామ్ పేజ్‌ దీని తన తల్లిదండ్రులు హ్యాండ్ డిల్ చేస్తున్నట్ల తెలుస్తుంది. ఇంస్టాగ్రామ్ లో ఈ పాపకు 2.9 మిలియన్‌ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్  కూడా ఉన్నవారు.  ఇంత చిన్నవయసులోనే ఇంత మంది ఫాలోవర్స్ హృదయాలను గెలుచుకోవడం ఎంతో ఆశ్చర్చకరమైన విషయం అని నెట్టిజన్‌లు మురిసిపోతున్నారు. 


 




నేటి తల్లిదండ్రులు తమ పిల్లల ఇష్టాలను తెలుసుకొని వారి కలలను నేరవేర్చడానికి ఎంతో కృషి చేస్తున్నారు. 
వారి ఇష్టాలు, అభిరుచులు, కలలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. పిల్లలని ఎప్పుడు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. వారి ఇష్టలను గుర్తించి వారికి సహాకరించడం చాలా ముఖ్యం. 


 


Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.