Road Accidents Prevention: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సలహాలు, సూచనలు
ట్రాఫిక్ నియమాలను ( Traffic Rules ), నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఎన్నో ప్రాణాలు కూడా నిలబడతాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ చాలా మంది పాటించడానికి ఆసక్తి చూపించరు.
ట్రాఫిక్ నియమాలను ( Traffic Rules ), నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఎన్నో ప్రాణాలు కూడా నిలబడతాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ చాలా మంది పాటించడానికి ఆసక్తి చూపించరు. ఫలితంగా కొంత మంది భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. బండి స్లోగా ( Drive Slowly) నడపండి, హెల్మెట్ పెట్టుకోండి ( Wear Helmet ) అని.. హెల్మెట్ పెట్టుకోవడం అనేది ట్రాఫిక్ పోలీసుల కోసం కాదు.. మీ కోసం మీ కుటుంబం కోసం ధరించండి అంటున్నారు ట్రాఫిక్ ఎస్సై కుమార్.
ఇటీవలే రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడంతో దానికి గల కారణాలు విశ్లేషించడానికి ప్రమాద స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ ఎస్సై కారణాలు తెలుకున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించి ఉంటే ఖచ్చితంగా నేడు ఆ వ్యక్తి బతికి ఉండేవాడు అని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో ( Social Media ) షేర్ చేశారు. సాధారణ ప్రజలకు పలు సూచనలు చేశారు. యాక్సిడెంట్ లొకేషన్ లోకి వెళ్లి ప్రమాదానికి గల కారణాలు, ఏం చేసి ఉంటే అలా జరగకుండా ఉండేదో వివరించారు.