Dancing With Crocodile: ఇంటర్నెట్ లో నిత్యం వేలాది వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్నిసార్లు ఆ వీడియోలు ఆహ్లాదకరంగా ఉండడం సహా మరికొన్ని వీడియోలు ఛాతీలో వణుకును పుట్టిస్తాయి. అయితే ప్రస్తుతం నెట్టింట ఓ అద్భుతమైన వీడియో వైరల్ గా మారింది. అందులో ఓ ప్రమాదకరమైన మొసలితో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నాడు. దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే వేల వ్యూస్ వస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో ఎలా ఉందో మీరూ చూసేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియోలో ఏముందంటే?


సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. ఓ నీటి కుంట లేదా చెరువు మధ్యలో ఓ వ్యక్తి తనతో పాటు మొసలిని పట్టుకొని ఉన్నాడు. రొమాంటిక్ డ్యాన్స్ చేసేప్పుడు అమ్మాయిని హత్తుకునే విధంగా అతడు మొసలిని హత్తుకొని నిల్చున్నాడు. అయితే ఆ మొసలి ఏ మాత్రం అతడిపై దాడి చేయలేదు. 



దాడి చేయలేదు సరికదా.. దానికి తోడుగా.. అతడితో పాటు కలిసి డ్యాన్స్ చేస్తోంది. కేవలం కొన్ని సెకన్లు పాటు ఉన్న ఈ వీడియో చాలా ఫన్నీగా, ఆశ్చర్యకరంగా ఉంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో వండర్‌డిక్స్ అనే పేజీకి అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్లు కూడా భారీగా కామెంట్లు చేస్తున్నారు.


Also Read: Optical Illusion Photo: ఈ చిత్రంలో ఏనుగు దాగుంది.. దాన్ని కనుగొంటే మీరు మేధావులే!


Also Read: Optical Illuison Photo: మీ కళ్లకు ఓ సవాల్..! ఈ ఫొటోలోని రాళ్ల మధ్య దాగున్న జంతువు ఏది?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook