King Cobra Attacks on Innocent Former: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిత్యం చాలా రకాల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందులో చాలా వీడియోలు జంతువులకు సంబంధించినవి ఉండగా.. మరికొన్ని ఎంతో భయం పుట్టించే పాముల వీడియోలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చాలామంది ఇలాంటి పాముల వీడియోలను చూసి విపరీతంగా భయపడిపోతున్నారు. అయితే ఇలాంటి పాములే కొరియా దేశంలో వ్యవసాయం చేయడానికి భూమిని చదును చేస్తుండగా రైతులకు కనిపించింది. అయితే వారు ఆ పాముని ఏం చేశారు మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పామని తెలియగానే చాలామంది ఆమడ దూరం పరిగెత్తే వారు ఉంటారు. మరికొందరైతే ఎంతో ఆసక్తిగా చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీటివల్ల మనుషులకు ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండటమే చాలా మంచిది. అంతేకాకుండా పర్యావరణం బాగుండేందుకు వీలైనంతగా వాటిని రక్షించేందుకు స్నేక్ క్యాచెస్ వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కోబ్రాల వీడియోలు స్నేక్ క్యాచర్స్ వేనని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా ఓ స్నేక్ క్యాచర్ పోస్ట్ చేసిందే.



ఇక వీడియో విషయానికొస్తే.. రైతులంతా పంటలను పండించేందుకు భూమిని చదును చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ రైతు భూమి చదును చేస్తుండగా.. ఒక పెద్ద రంధ్రం కనిపిస్తుంది. అయితే ఆ రైతుకు అనుమానం వచ్చి ఆ రంధ్రం ఏంటని చూడగా అతనికి కోబ్రా కనిపిస్తుంది. ఇంతలోనే అక్కడికి స్నేక్ క్యాచర్ చేరుకుని ఆ బుసలు కొడుతున్న కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అది ఏ మాత్రం దొరకకపోవడంతో మళ్లీ ఎంతో జాగ్రత్తగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ పాము ఆ స్నేక్ క్యాచర్ చేతికి చిక్కుతుంది. ఇంతలోనే ఆ క్యాచర్ పామును పట్టుకుని సురక్షితంగా సంచిలో వేసుకుంటాడు. మీరు ఈ వీడియోలో గమనిస్తే స్నేక్ క్యాచర్ ఆ పాము ఎన్నోసార్లు కాటేయడానికి ప్రయత్నించింది. అయితే స్నేక్ క్యాచర్ నైపుణ్యం గల వ్యక్తి కావడంతో ఎంతో జాగ్రత్తగా ఆ పామును పట్టుకున్నాడు.


ఈ వీడియోను ఓ కొరియన్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ కోబ్రా వీడియోను ఒక లక్ష పదివేలకు పైగా మంది వీక్షించగా.. పాములను రక్షిస్తున్న ఆ స్నేక్ క్యాచర్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరికొందరు సోషల్ మీడియా వినియోగదారులైతే ఈ వీడియోను చూసి తెగ భయపడిపోతున్నారు. పాములను పట్టుకునే క్రమంలో నైపుణ్యం ఉంటేనే అలాంటి ప్రయత్నాలు చేయాలి. లేకపోతే పాము కాటుకు గురై మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి.


Also Read:  Taraka Ratna Death Live Updates: 'మోకిల' నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం..భోరున విలపిస్తున్న నందమూరి కుటుంబం


Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook