David warner Video: శ్రీ వల్లి పాటకు స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్- వీడియో వైరల్
David warner video: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరో కొత్త వీడయో చేశారు. ఇనెటర్నెట్లో వైరల్ అవుతున్న ఆ వీడియో చూద్దామా?
David Warner Dance on Srivalli Song: అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' మూవీ గత ఏడాది రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో ట్రెండ్స్‌కు.. మూలంగా (Pushpa movie Trends) మారిపోయింది. సాధారణ జనంతో పాటు.. సెలెబ్రెటీలు సైతం ఈ సినిమా డైలాగ్స్‌కు లిప్ సింక్, చేస్తున్నారు, పాటలకు (Pushpa movie Songs) స్టెప్పులేస్తున్నారు.
సెలెబ్రెటీల్లో.. ఇలాంటి వీడియోల గురించి మాట్లాడుకుంటే.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ముందుగా (David Warner Funny Video) చెప్పుకోవాలి. ఎందుకంటే కరోనా మొదటి లాక్డౌన్ సమయంలో.. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా స్పూఫ్ వీడియోలు, లిప్ సింక్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు (David Warner viral video) వార్నర్.
కొవిడ్ కారణంగా క్రికెట్ మ్యాచ్‌లు ఆడలేకపోయినా.. వీడియోలు చేస్తూ డేవిడ్ వార్నర్ ఫుల్ టైం పాస్ చేశాడు. దీనితో ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డేవిడ్ వార్నర్‌కు లెక్కలేనంత మంది ఫ్యాన్స్‌గా మారారు.
డేవిడ్ వార్న్ చేసిన బుట్ట బొమ్మ సాంగ్ డ్యాన్స్ వీడియో (David Warner Botta bomma video) ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మందికి ఈ వీడియో ఫేవరెట్‌గా మారిపోయింది.
పుష్ప మూవీ విడుదలయ్యాక.. యమ క్రేజ్ సాధించిన తగ్గేదే లే డైలాగ్‌కు లిప్ సింక్ చేసి మెప్పించాడు వార్నర్.
ఇప్పుడు మరో సారి.. పుష్ప సినిమాకు సంబంధించిన వీడియోతో ముందుకొచ్చాడు. అదే 'చూపే బంగారామాయేనే' సాంగ్‌లో అల్లు అర్జున్ చేసే డ్యాన్స్. ఈ పాట తమిళ్ వెర్షన్‌కు స్టెప్పులేశాడు డేవిడ్ (David Warner Dance to Pushpa Song) వార్నర్. చివర్లో తగ్గేదే లే డైలాగ్ సిగ్నేచర్ మూమెంట్ కూడా చేశాడు.
ఆ పాట చేయండి బ్రో..
'వాట్ నెక్ట్స్' అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశాడు డేవిడ్ వార్నర్. దీనితో ఆ వీడియో కింద కామెంట్స్‌లో ఊ అంటావా మావా సాంగ్ చేయండి బ్రో.. అంటు ఇన్‌స్టా యూజర్లు సలహా ఇస్తున్నారు. ఇంకా వేరే వేరే పాటలను కూడా (David Warner fans) సూచిస్తున్నారు.
Also read: Viral Video: బీటీఎస్ స్టైల్ ఊ అంటావా.. ఊ ఊ అంటావా సాంగ్ చూశారా..!
Also read: Video: ఈ డాగ్ నిజంగా హీరోనే.. ఆ జింక పిల్లను ఎలా కాపాడిందో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook