Video: ఈ డాగ్ నిజంగా హీరోనే.. ఆ జింక పిల్లను ఎలా కాపాడిందో చూడండి..

Video: నదిలో మునిగిపోతున్న జింక పిల్లను ఓ శునకం రక్షించగలిగింది. జింక పిల్లను నోట కరిచి దాన్ని ఒడ్డుకు చేర్చుకుంది. సాటి ప్రాణి ప్రాణం కాపాడిన ఆ శునకాన్ని హీరో డాగ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2022, 04:45 PM IST
  • నదిలో మునిగిపోతున్న జింక పిల్లను కాపాడిన శునకం
  • జింక పిల్లను నోట కరిచి ఒడ్డుకు చేర్చిన శునకం
  • ఆ దృశ్యాన్ని వీడియో తీసిన శునకం యజమాని
Video: ఈ డాగ్ నిజంగా హీరోనే.. ఆ జింక పిల్లను ఎలా కాపాడిందో చూడండి..

Dog saves baby deer: కళ్లముందే రోడ్డు ప్రమాదం జరిగినా... చూసీ చూడనట్లు, తమకేమీ పట్టనట్లు వెళ్లిపోతుంటారు కొందరు. బాధితులు నెత్తుటి గాయాలతో అల్లాడుతున్నా.. ఒక్క క్షణం ఆగి వారికి సాయం చేసేందుకు వెనుకాడుతారు. అలాంటి సందర్భాల్లో మనుషుల కన్నా జంతువులే నయమనిపిస్తుంటుంది. సాటి ప్రాణుల పట్ల అవి అత్యంత దయతో ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ శునకం-జింక పిల్ల వీడియోను చూస్తే ఆ మాట నిజమనిపించకమానదు.

ఆ వీడియోను గమనిస్తే... నదిలో మునిగిపోతున్న ఓ జింక పిల్లను శునకం నోట కరిచి ఒడ్డుకు తీసుకురావడం గమనించవచ్చు. జింక పిల్ల నదిలో పడటాన్ని గమనించిన శునకం... వెంటనే అందులోకి దూకేసింది. ఆపై జింక పిల్లను నోట కరిచి.. నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. దీంతో జింక పిల్ల ప్రాణాలతో బయటపడింది. 

శునకం యజమాని ఆ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశాడు. 'మునిగిపోతున్న జింకను కాపాడిన శునకం.. ఒక పాఠం..' అని ఆ వీడియోకి (Viral Video) తన కామెంట్‌ను జోడించాడు. జింక పిల్లను కాపాడిన ఆ శునకాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 'ఈ ప్రపంచంలో అన్ని జీవుల కంటే శునకాలే ఉత్తమమైన ప్రాణులు...' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్.. 'ఇప్పటికైనా మనుషులు అడవులను నరికేయడం ఆపాలి. అభయారణ్యాల్లోకి వెళ్లవద్దు. ఆ జింక పిల్లను కాపాడిన శునకానికి నా ముద్దులు..' అని పేర్కొన్నాడు. మరికొందరు నెటిజన్లు దాన్ని హీరో డాగ్ అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

Also Read: క్యాన్సర్‏తో పోరాటం.. గుండుతో హీరోయిన్ ఫోటోషూట్! నా లవ్ కోసం బలంగా తిరోగిస్తా!!

Also Read: Akhanda Roar On Hotstar: బాలయ్య బాబునా మజాకా.. థియేటర్లలోనే కాదు ఇళ్లల్లో కూడా మాస్ జాతరే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News