దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్కడైతే ప్రేమ ఉంటుందో.. అక్కడే ఒక రకమైన అసంతృప్తికి కూడా బీజం పడుతుంది. ప్రేమ ఎంత లోతుగా ఉంటుందో.. అసంతృప్తి కూడా అంతే లోతుగా ఉంటుంది. అందుకే ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ, అసంతృప్తి రెండూ ఒకే నావలో ప్రయాణిస్తుంటాయంటుంటారు. నావలో తోటి ప్రయాణికులు ఉన్నారంటే, నాలుగు అంశాలు చర్చించుకోవడంతోపాటు భిన్న వాదనలు వినిపించడం కూడా సహజమే కదా! అలాగే ఇది కూడా. మూడ్ బాగున్నంత వరకు అంతా బాగానే ఉంటుంది కానీ ఒక్కసారి మూడ్ మారిందంటేనే అసలు సమస్య మొదలవుతుంది. అప్పటివరకు మనం అని పిలుచుకున్న బంధాల మధ్య లోకి నేను, నాది అనే మాట వచ్చి చేరుతుంది. 


ఒకానొక దశలో సమాజంలో ప్రేమ వివాహాలంటే, తాజా శ్వాసలా అనిపించేది. అప్పుడే సమాజంలో కొంత సామాజిక అసమానతలు తగ్గుముఖం పట్టాయి. అందుకే ఆ తాజాదనాన్ని తీసుకొచ్చేవారి రక్షణ కోసం పాటుపడటం మన బాధ్యతల్లో ఓ భాగం అవ్వాలి. నిత్యం పేపర్లు, టీవీల్లో ఎక్కడ చూసినా కొత్తగా పెళ్లయిన ప్రేమ జంటలు తమ దాంపత్యంలోని మాధుర్యాన్ని కాపాడుకోవడానికి తిప్పలు పడుతున్న ఘటనలే కనిపిస్తున్నాయి. ఈ రకమైన సంఘర్షణలు ఏ ఒక్కరికో కాకుండా చాలామందికి ఎదురవుతున్నాయి. హృతిక్ రోషన్-సుజైనా ఖాన్, అమీర్ ఖాన్-రీనా దత్తా, అర్జున్ రాంపాల్-మెహర్ జెసియా వంటి సెలబ్రిటీ దంపతుల విడాకుల ప్రభావం సైతం సమాజంపై బాగానే కనిపిస్తోంది. అందుకే ఇది కేవలం సెలబ్రిటీ కల్చర్ మాత్రమే అని కొట్టిపారేయడానికి వీల్లేదని గ్రహించినప్పుడే మనం దీనికి ఓ పరిష్కారాన్ని సైతం కనుగొనగలిగే ఆస్కారం ఉంది. 


డియర్ జిందగీకి వస్తోన్న ఈమెయిల్స్ లో కొంతమంది యువతీయువకులు ప్రేమ వివాహంతో ఎదురైన సమస్యలను పంచుకుంటున్నారు. సమాజంతో పోరాడి ప్రేమ పెళ్లి చేసుకున్న తాము తమ ప్రేమలో ఎదురైన ఎన్నో కష్టాలను అవలీలగా దాటేయగలిగాం కానీ విడిపోయి వేరైన తర్వాత ఎదురయ్యే అనుభవాలను అధిగమించడమే చాలా కష్టం అని. జీవితంలో ఏమైనా అసలు సవాళ్లు ఎదురైనప్పుడు, వాటిని అధిగమించడాన్నే దంపతులు కష్టంగా భావిస్తున్నారని దీన్నిబట్టి అర్థమవుతోంది. అసలు సమస్య ఎప్పుడు ఎదురవుతుందంటే... రోజూ ఏదో ఓ ఇబ్బందిని ఎదుర్కోవడం దైనందిన జీవితంలో ఓ భాగమైనప్పుడు. 


అయితే, ఇక్కడ ముఖ్యంగా గ్రహించాల్సిన అసలు విషయం ఏంటంటే... బయటి నుంచి చూస్తే కనిపించని సవాళ్లెన్నో జీవితంలో ప్రతీ రోజూ, ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటాయని. సవాళ్లు, కష్టాలు ఎప్పుడూ చెప్పి రావు కానీ కొన్నిసార్లు అసలు కష్టాలు పెళ్లి తర్వాతే ఎదురవచ్చు. కానీ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మీరు (దంపతులు) పెళ్లికి ముందే సిద్ధమై ఉండాలి. అయితే ఎటొచ్చీ మీరు తెలుసుకోనిది ఏంటంటే... ఎప్పుడైనా ఎదైనా ఇబ్బంది ఎదురై, దంపతులు ఇద్దరిలో ఎవరైనా అసంతృప్తికి గురైతే, అప్పుడు సమస్యను అధిగమించడం ఎలా అనే అంశంపై సంసిద్ధంగా ఉండకపోవడం వల్లే ఈ సమస్య అంతా వచ్చి పడుతోందని. ఒకరికి అసంతృప్తికి గురైనప్పుడు మరొకరు సర్దుకుపోతే సమస్య అనేదే ఉండదు. 


తాజా కథనంపై మీ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వగలరు: 
https://www.facebook.com/dayashankar.mishra.54, https://twitter.com/dayashankarmi


హిందీలో చదవడం కోసం క్లిక్ చేయండి: डियर जिंदगी: 'कागजी' नाराजगी बढ़ने से पहले...