Diwali 2024: దీపావళికి 200 ఏళ్లుగా ఆ గ్రామం దూరం.. మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కడో తెలుసా?
These Village Far To Diwali Celebration Since 200 Years: ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను చేసుకుంటుండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మాత్రం పండుగ చేసుకోవడం లేదు. ఏ గ్రామం, ఎందుకో తెలుసుకుందాం.
Diwali Celebrations: హిందూవుల అతి పెద్ద పవిత్ర పండుగ దీపావళి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూవులు ఎంతో ఉత్సాహంగా పండుగ చేసుకుంటుండగా ఒకే గ్రామంలో మాత్రం ఈ పండుగ అసలు చేసుకోరు. ఇది ఇప్పటి నుంచి కాదు ఏకంగా 200 సంవత్సరాల నుంచే దీపావళిని చేసుకోవడం లేదు. అసలు అతి ముఖ్యమైన పండుగ దీపావళిని ఎందుకు చేసుకోవడం లేదు.. ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఆ ఊరి కథ ఏమిటి? దీనికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
Also Read: Annaprasadam: తిరుమల అన్నప్రసాదం విరాళం చెల్లించడం ఇలా.. ఒక్క పూటకు ఎంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో దీపావళిని చేసుకోని ఏకైక గ్రామం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్ననపాలెం గ్రామానికి ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత అనే బదులు వింత అని చెప్పవచ్చు. ఈ గ్రామంలో 200 సంవత్సరాలుగా దీపావళి చేసుకోవడం లేదంట. సొంత గ్రామస్తులే కాదు ఈ గ్రామం యువకులను పెళ్లి చేసుకుని వచ్చే కోడళ్లు కూడా ఇది పాటించాల్సిందే. ఆ గ్రామం సంప్రదాయాన్ని కచ్చితంగా వినాల్సిందే.
Also Read: Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు చెక్కు అందజేత
రెండు శతాబ్దాల కిందట ఈ గ్రామంలో దీపావళి రోజున ఓ బాలికకు పాము కాటు వేసింది. ఆ పాము కాటుతో తీవ్ర అస్వస్థతకు గురై పాప చనిపోయింది. అంతేకాకుండా అదే రోజు హిందూవులు పవిత్రంగా భావించే ఆవులు రెండు కూడా చనిపోయాయి. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. పవిత్రమైన పండుగ రోజు బాలికతోపాటు ఆవులు చనిపోవడం గ్రామానికి అరిష్టంగా భావించారు. అప్పటి నుంచి గ్రామంలో దీపావళి పండుగ చేసుకోవడంపై నిషేధం విధించారు. ఎవరైనా గ్రామ సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని గ్రామస్తుల్లో నమ్మకం ఏర్పడింది.
అయితే ఈ సంప్రదాయాన్ని ఓ వ్యక్తి ఉల్లంఘించి దీపావళి పండుగ చేసుకున్నాడు. గ్రామస్తులు అతడిని... అతడి కుటుంబాన్ని శిక్షించలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అతడి కుమార్తె అనారోగ్యం బారినపడి మృతి చెందింది. దీంతో దీపావళి చేసుకోవాలని భావిస్తున్న గ్రామస్తుల్లో ఇకపై దీపావళి చేసుకోరాదని కఠినంగా నిర్ణయించుకున్నారు. దీపావళి చేసుకుంటే తమ కుటుంబంలో.. గ్రామంలో ఏదైనా అరిష్టం జరుగుతుందనే నమ్మకం ఏర్పడింది. దీంతో అప్పటి నుంచి పున్ననపాలెం గ్రామ ప్రజలు దీపావళి చేసుకోవడం లేదు. కాగా కారణాలు వేరయినా దేశంలోని మరికొన్ని గ్రామాల్లో దీపావళి చేసుకోవడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.