Viral snake video: పాములంటే చాలా మందికి భయం ఉంటుంది. వాటిని చూస్తేనే కొంత మంది పరుగు పెడుతుంటారు. ఇదిలా ఉంటే మరి కొందరు మాత్రం అవే పాములను చేతితో పట్టుకుంటారు. మెడలో కూడా వేసుకుంటారు. అది పాములను (Snakes vidos) గురించి ఉండే అవగాహనపై ఆధారపడి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెద్దలు ఓ మాట చెబుతుంటారు. పాములు కానీ ఇతర జీవులు గానీ.. తమకు ప్రమాదం ఉందని భావిస్తే తప్ప.. ఎదురు దాడికి దిగవు అని.


అలాంటి ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ (viral videos) అవుతుంది.


ఆ వీడియోలో ఏముందంటే.. 


ఓ పాము స్వభావం పరిశీలించేందుకు ప్రయత్నించి దానిని వీడియోలో బంధించారు కొందరు ఔత్సాహికులు. పాము ముందు నకిలి  చేతును (ప్లాస్టిక్ చెయ్యి)ను పెట్టి.. దానికి ప్రమాదం ఉందనే బ్రాంతిని (Snake bite test) కలిగించారు.


దీనితో.. కొన్ని క్షణాలు బాగానే ఉన్న ఆ పాము​.. తనకు ఏదో అపాయం రాబొంతుందనే ఉద్దేశంతో.. ఆ ప్లాస్టిక్ చెయ్యిపై రెప్పపాటులో కాటేసి దాని మళ్లి ఎప్పటిలానే ముడుచుకుంది. అది ప్లాస్టిక్ చెయ్యి కాబట్టి సరిపోయింది.. అక్కడ నిజంగానే మనిషి చెయ్యి ఉండి ఉంటే ఆ వ్యక్తి పరిస్థితి ఏమయ్యేదో!


ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.


అయితే ఆ పాము​ ఎంత వేగంగా కాటు వేసిందో (Snakes slow motion video) తెలుసుకునేందుకు.. వీడియోను స్లో మోషన్​లో చూడాల్సి వచ్చింది. దీని బట్టే అర్థం చేసుకోవచ్చు విష సర్పాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది.


అయితే ఆ పాము విషపూరితమైందా? ఆ పాము ఏ రకానికి చెందింది అనే వివరాలు  తెలియరాలేదు.


ఈ వీడియోను snake._.world అనే ఇన్​స్టాగ్రామ్ యూజర్​ షేర్ చేయగా.. గంటల వ్యవధిలోనే వేలాది మంది వీక్షించారు. మరి ఆ భయంకరమైన వీడియో చూసే ధైర్యం మీకుందా?



Also read: Viral video: అదృష్టం అంటే అతడిదే- క్షణాల్లో రెండు సార్లు చావు తప్పింది!


Also read: Viral Video: నువ్వు నన్ను కెలికితే..నేనెందుకు ఊరుకుంటాను, వైరల్ అవుతున్న వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook