Dog bites Tiger Ear and Lion enjoys Fight in Zoo: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబందించిన చాలా వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుక్క భారీ పులి చెవిని కోరికేసింది. పక్కనే ఓ పెద్ద సింహం కూడా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యానిమేషన్ సినిమా తప్ప.. పులి, సింహం, కుక్క ఒకదానితో ఒకటి ఎప్పుడూ కలిసి ఉండవు. అయితే ఎప్పుడూ కలిసిపోలేని ఈ మూడు జంతువులు జూలో ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అవి సరదాగా ఆడుకుంటున్నాయి కూడా. కుక్క పులి చెవిని కొరికే ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా పులి కుక్కను ఏమీ అనదు. చాలా సమయం తర్వాత కుక్క చెవిని వదలక పోవడంతో.. పులి తన పంజా విసురుతుంది. అయినా కూడా కుక్క వదలకుండా సరదాగా ఆడుకుంటుంది. 



కుక్క పులి చెవిని కోరుకుతుండగా.. పక్కనే ఓ పెద్ద సింహం కూడా ఉంటుంది. కుక్క, పులి యుద్ధం మధ్యలోకి రావడం ఇష్టంలేక సింహం దూరంగా ఉండిపోతుంది. కుక్క, పులి ఆటను అది సరదాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో 'జంతువులు_పవర్స్' అనే పేజీ పోస్ట్ చేసింది. దీనికి డాగ్ Vs టైగర్ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకి 445k పైగా వ్యూస్ మరియు 17k లైక్‌లు వచ్చాయి. 


Also Read: భారత్‌తో పాకిస్తాన్ పోరు.. వైరల్ అవుతోన్న పాక్‌ పేసర్ షహీన్‌ అఫ్రిది ట్వీట్‌!


Also Read: పరుగులు చేస్తున్నా.. భారత జట్టులో చోటు రావట్లేదు! యువ ఓపెనర్‌ అసహనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook