Elephant Smart Behaviour Goes Viral: అడవిలో ఏనుగులు గుంపులుగా సంచరిస్తుంటాయి.  ఈ క్రమంలో కొన్నిసార్లు అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఏనుగులు వస్తుంటాయి. ముఖ్యంగా కొన్నిసార్లు గుంపులుగా అడవికి దగ్గరగా ఉన్న గ్రామాలలోకి నీటి కోసం వెళ్తాయి. ఈ క్రమంలో ఇలాంటి సందర్బాలలో పంటపోలాలను ధ్వంసం కూడా చేస్తుంటాయి. పొరపాటున ఏనుగుల బారిన పడితే ఇంకా అంతే సంగతులు. ఏనుగులు తొండంతో తింపిపడేస్తుంటాయి. కొన్నిసార్లు ఏనుగులు.. మదం ఎక్కి ఉంటాయి. ఈ సమయంలో ఆడతోడు దొరక్కపోతే మిగతా ఏనుగులపైన దాడికి పాల్పడుతాయి. అంతటితో ఆగకుండా గుంపులో ఉండే ఇతర ఏనుగులను కిందపడేసి హని కల్గిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అడవిలో టూరిస్టులు ఏనుగుల దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తారు. సెల్ఫీకోసం నానా తంటాలు పడుతుంటారు. ఇలాంటి సమయంలో కూడా ఏనుగులు కొన్నిసార్లు దాడులకు పాల్పడుతుంటాయి. ఏనుగుల దాడులకు సంబంధించిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


ఏనుగులు చాలా తెలివైన జంతువులని చెబుతుంటారు. ఇవి కొన్నిసార్లు ప్రవర్తించే తీరు చూస్తే, మనుషులే షాకింగ్ తో నోరెళ్లబెడతారు. అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి ఏనుగులు వెళ్లి, ఆహారం కోసం ఇళ్లపైకి దాడి చేస్తుంటాయి. ఇప్పటికే ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిలుస్తుంటాయి. వీటితో కొన్ని నవ్వుపుట్టించేవిగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు దడపుట్టించేవిగా కూడా ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఏనుగులు ఫన్నీగా కూడా ప్రవర్తిస్తుంటాయి. అచ్చం ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇక్కడ ఒక ఏనుగు.. అడవిలో నుంచి బైటకు వచ్చింది. అది రోడ్డుమీదకు వచ్చి మరో వైపుకు వెళ్లడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో అధికారులు.. అప్పటికే ఏనుగులు బైటకు రాకుండా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారు. కానీ ఏనుగు మాత్రం.. ఎంతో జాగ్రత్తగా కరెంట్ ఫెన్సింగ్ ను తాకకుండా రోడ్డుమీదకు వచ్చింది. అంతే కాకుండా.. ఒకవైపు నుంచి మరోకవైపుకు రోడ్డుదాటుకుంటూ వెళ్లింది. రోడ్డుపైన వెళ్తున్న వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.


ప్రయాణికులు కూడా ఏనుగును చూసి షాకింగ్ తో ఉండిపోయారు. ఏనుగు మాత్రం దర్జాగా అడవిలో నుంచి కరెంట్ పోల్ ను కిందకు పడేసి , మెల్లగా రోడ్డుదాటుకుంటూ వెళ్లిపోయింది.ఈ  వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు వామ్మో.. షాకింగ్ తో నోరెళ్లబెడుతున్నారు. ఏనుగు తెలివి మాములుగా లేదుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook