Elephant Video: నది దాటుతూ...ప్రవాహంలో కొట్టుకుపోయిన పిల్ల ఏనుగు..తరువాత ఏమైంది
Elephant Video: ఏనుగుల గుంపుకు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న చిన్నారి ఏనుగును కాపాడే ప్రయత్నం అందర్నీ ఆలోచింపజేస్తోంది.
Elephant Video: ఏనుగుల గుంపుకు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న చిన్నారి ఏనుగును కాపాడే ప్రయత్నం అందర్నీ ఆలోచింపజేస్తోంది.
జంతువులకు సంబంధించిన ఏ వీడియో అయినా ఎప్పుడూ వైరల్ అవుతుంది. వేగంగా ప్రవహిస్తున్న ఓ నదిని దాటుతున్న ఏనుగుల గుంపుకు చెందిన వీడియో ఇది. సాఫీగా ప్రవాహం దాటేసేవే. కానీ ఇంతలో ఓ పిల్ల ఏనుగు ప్రవాహంలో కొట్టుకుపోసాగింది. ఆ చిన్నారి ఏనుగును కాపాడేందుకు మిగిలిన ఏనుగులు చేసిన ప్రయత్నాలే ఈ వీడియోను ఆసక్తికరంగా మార్చాయి.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నదీ ప్రవాహాన్ని దాటే క్రమంలో ఓ పిల్ల ఏనుగు ప్రవాహంలో కొట్టుకుపోతుంటే..ఆ చిన్నారి ఏనుగు తల్లి చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఓ ఏనుగుల గుంపు నదీ ప్రవాహాన్ని దాటుతుండటం చూడవచ్చు. ఈ లోగా ఓ పిల్ల ఏనుగు ఆ ప్రవాహంలో కొట్టుకుపోసాగింది. అది చూసి ఆ తల్లి ఏనుగు పరుగు పరుగున అక్కడికి చేరుతుంది. చిన్నారి ఏనుగును కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పిల్ల ఏనుగు చాలాదూరం కొట్టుకుపోతుంది. వీడియోలో కన్పిస్తున్న ఈ దృశ్యం చాలా భయం గొలుపుతోంది. నీటి ప్రవాహం చాలా ఎక్కువే ఉంది. పిల్ల ఏనుగు కాళ్లు నేలపై ఆన్చలేకపోతోంది. ఫలితంగా నీళ్లతో పాటు కొట్టుకుపోతోంది. అది చూసి ముందుగా తల్లి ఏనుగు అక్కడికి చేరుకుంటుంది. ఆ తరువాత మరో ఏనుగు అక్కడికి వస్తుంది. రెండూ కలిసి పిల్ల ఏనుగును నది దాటిస్తాయి.
ఈ ఏనుగుల వీడియో అందర్నీ చాలా ఆకట్టుకుంటోంది. ఏనుగుల ఐకమత్యం, తల్లి మనసు చూసి సోషల్ మీడియాలో కామెంట్లు ఊపందుకుంటున్నాయి.ఈ వీడియోను అప్పుడే 15 లక్షల మంది వీక్షించారు.
Also read: Lion Shocking Video: సింహం నోట్లో ఇరుక్కుపోయిన ప్లాస్టిక్ డబ్బా, తరువాత ఏమైంది..వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook