Mafia Boss Bed Sheets: పేరు మోసిన రౌడీ. మాఫియా రాజ్యానికి అధిపతిగా కొనసాగుతున్న ఓ నిందితుడు అంతర్జాతీయంగా 'మోస్ట్‌ వాంటెడ్‌'గా ఉన్నాడు. దొంగతనాలు, దోపిడీలు రకరకాల నేరాలకు పాల్పడుతూ నేర సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్న అతడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టి శిక్ష కూడా విధించారు. దీంతో జైలుకు తరలించారు. ఎన్నో నేరాలు చేసిన అతడికి జైలుకు ఒక లెక్క? సునాయాసంగా ఆ జైలు నుంచి బయటకు వచ్చాడు. ఎలా జైలు గోడలు దూకి పారిపోయి వచ్చాడు. అదెలా అంటే దుప్పట్లు, బెడ్‌ షీట్లు ఉపయోగించి జైలు నుంచి తప్పించుకోవడం గమనార్హం. అతడు జైలు నుంచి తప్పించుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. లక్షలాది మంది ఆ వీడియోను చూశారు. ఈ సంఘటన ఇటలీలో చోటుచేసుకుంది. జైలు శిక్షతో అతడి పాపం పండింది అని ప్రత్యర్థులు, బాధితులు అనుకునేలోపు జైలు నుంచి పారిపోవడం గమనార్హం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: King Cobra Vs Stray Dogs: కుక్కలే గుంపులుగా వస్తే సింగిల్‌గా దిగిన పాము గెలిచిందా? ఓడిందా?


ఇటలీలోని ఫాగియాకు చెందిన మార్కో రడ్యూనో (40) మాఫియాను నిర్వర్తిస్తున్నాడు. ఆ దేశంలో ఐదో అతిపెద్ద మాఫియా గ్యాంగ్‌ అతడిదే. ఎన్నో నేరాలు, అఘాయిత్యాలకు పాల్పడడంతో ఆ దేశంలో మోస్ట్‌ వాంటెడ్‌ నిందితుడిగా పోలీసులు ప్రకటించారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా చిక్కడం లేదు. ప్రత్యేక పోలీస్‌ దళాలు ఏర్పాటుచేసి గాలిస్తుండగా రడ్యూనో ఫ్రాన్స్‌కు ద్వీపకల్ప ప్రాంతం ఆలెరియాలో చిక్కాడు. ఒక రెస్టారెంట్‌లో ఓ యువతితో కలిసి విందు ఆరగిస్తుండగా రడ్యూనోను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

Also Read: King Cobra on Fan: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇంట్లో ఫ్యాన్‌పై తిరుగుతూ కింగ్‌ కోబ్రా హల్‌చల్‌


అనంతరం విచారణ చేపట్టిన న్యాయస్థానం రడ్యూనోకు 24 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. సార్డినియా ప్రాంతంలోని జైలులో మార్కో రడ్యూనోను బంధించారు. శిక్ష అనుభవిస్తున్న రడ్యూనో గతేడాది డిసెంబర్‌లో జైలు నుంచి తప్పించుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉండే ఈ జైలు నుంచి అతడు తప్పించుకోవడంతో పోలీస్‌ శాఖ నివ్వెరపోయింది. అసలు ఎలా పారిపోయాడో పోలీస్‌ వర్గాలకు అంతుచిక్కలేదు. ఈ క్రమంలోనే జైలులోని సీసీ కెమెరాలన్నింటి ఫుటేజీని చూశారు. ఒకటికి రెండు సార్లు చూస్తుండగా అప్పుడు రడ్యూనో తప్పించుకునే దృశ్యాలు బయటపడ్డాయి. అతడు తప్పించుకున్న విధానం చూసి ఆశ్చర్యపోయారు.





జైలు గోడల నుంచి చాలా సులువుగా రడ్యూనో తప్పించుకున్నాడు. జైలులో ఖైదీలు వినియోగించే దుప్పట్లు, బెడ్‌ షీట్లను రడ్యూన్‌ తీసుకున్నాడు. వాటిని పెద్ద తాడుగా చేసుకున్నాడు. బెడ్‌ షీట్‌తో చేసిన తాడును పట్టుకుని జైలు గోడ నుంచి బయటకు దూకాడు. అంతే బెడ్‌ షీట్లను ఈ విధంగా వాడడం చూసి పోలీసులు నివ్వెరపోయారు. తప్పించుకున్న రడ్యూనో కోసం పోలీస్‌ బృందాలు గాలిస్తున్నాయి. కాగా, రడ్యూనో పారిపోవడానికి జైలులోని తోటి ఖైదీలు సహకరించారని తెలిసింది. వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. తప్పించుకున్న వీడియో బయటకు విడుదలైంది. రడ్యూనో తప్పించుకునే దృశ్యాలు వైరల్‌గా మారాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి