Instagram Kids Version: ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వెనక్కి తగ్గారు. టీనేజర్లు, పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆరోపణలతో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్‌స్టాగ్రామ్(Instagram).ఫేస్‌బుక్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. కోట్లాదిమంది ఫాలోవర్లు ఉన్న ఓ మాధ్యమం. ముఖ్యంగా టీనేజర్లు అధికంగా ఫోలో అయ్యే యాప్. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్ టీనేజర్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే ఆరోపణలు అధికమౌతున్నాయి. గతంలో ఈ ఆరోపణల్ని ఖండించిన ఫేస్‌బుక్ ..ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. పిల్లల కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ వెర్షన్ తీసుకురావాలనే ఆలోచనను తాత్కాలికంగా విరమించుకుంది.


ఇన్‌స్టాగ్రామ్ కిడ్స్(Instagram Kids Version) పేరుతో ప్రత్యేక యాప్ కోసం ఫేస్‌బుక్ సీఈవో మార్క జుకర్‌బర్గ్ గత కొద్దికాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే యాప్ డెవలప్‌మెంట్ పూర్తయి..ఇవాళో రేపో ప్రారంభం కావల్సిన పరిస్థితి. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికలపై ఫేస్‌బుక్ అరాచకం పెరుగుతోందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ వరుస కథనాలు ప్రచురించింది. ఇన్‌స్టాగ్రామ్ వల్ల యువత మానసికంగా కుంగిపోవడం, ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతున్నా..ఫేస్‌బుక్ (Facebook)ఎలాంటి చర్యలు చేపట్టలేదనేది ఆ కథనాల సారాంశం. ఈ కథనాల్ని ఇన్‌స్టాగ్రామ్ ఖండించింది. ఇన్‌స్టాగ్రామ్ కిడ్స్ ప్రయత్నాలపై స్పందించింది. అన్ని వైపుల్నించి వస్తున్న అభ్యంతరాల నేపధ్యంలో తల్లిదండ్రులు, మేధావులు, విశ్లేషకులు, పాలసీ మేకర్స్ , నియంత్రణ విభాగాల్నించి పూర్తి స్థాయిలో ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తరువాతే ఇన్‌స్టాగ్రామ్ కిడ్స్ వెర్షన్ తీసుకొస్తామని వెల్లడించింది. ఈ వెర్షన్‌లో పేరెంటింగ్ టూల్ ఉంటుందని..పిల్లల యాక్టివిటీలను ఎప్పటి కప్పుడు పెద్దలు పర్యవేక్షించవచ్చని తెలిపింది. 


ప్రస్తుతం 13 ఏళ్లపైబడిన పిల్లలు మాత్రమే ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించాలని..పిల్లల పేరుతో అక్కౌంట్లు ఉన్నా పర్యవేక్షకులు అక్కౌంట్ నిర్వహించవచ్చనే గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఈ ఏడాది మార్చ్ నెలలో ఫేస్‌బుక్ అధినేత మార్గ్ జుకర్‌బర్గ్..ఇన్‌స్టాగ్రామ్ కిడ్స్ వెర్షన్ గురించి అధికారికంగా ప్రకటించారు. మే నెలలో రావల్సి ఉండగా, 44 మంది అటార్నీ జనరల్స్ ఇందుకు వ్యతిరేకంగా జుకర్‌బర్గ్‌(Mark Zuckerberg)కు లేఖ రాశారు. అభ్యంతరం వ్యక్తం చేశారు. 2017లో ప్రవేశపెట్టిన ఫేస్‌బుక్ మెసెంజర్ కిడ్స్ యాప్‌పై కూడా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇన్‌స్టాగ్రామ్ కిడ్స్ వెర్షన్‌ను విరమించుకున్నా..రానున్న రోజుల్లో కచ్చితంగా ప్రవేశపెట్టనున్నారు. 


Also read: Google Services: గూగుల్ ఎక్కౌంట్ బ్లాక్ కాకూడదంటే ఫోన్ మార్చుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook