ప్రపంచంలో అందరికీ సుపరిచితమైన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఫేస్ బుక్( Facebook ). ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ను త్వరలో ఇండియాలో ప్రారంభించనుంది. అది న్యూస్ సర్వీసెస్. వార్తల్ని ఎప్పటికప్పుడు అందించే ఫీచర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఫేస్ బుక్ ఇండియా యూజర్లకు ఇది నిజంగా శుభవార్తే. రానున్న కొన్ని నెలల్లో ఫేస్ బుక్ న్యూస్ ( Facebook news ) ను ఇండియాలో ప్రవేశపెట్టనుంది ఆ సంస్థ. ప్రస్తుతం కేవలం యూఎస్ ( USA ) లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ న్యూస్ ఫీచర్ ను భారత్ ( India ) సహా..బ్రెజిల్ ( brazil ) , ఫ్రాన్స్ ( France ), జర్మనీ ( Germany ), యూకే ( UK ) ల్లో ప్రారంభించనున్నామని ఫేస్ బుక్ ప్రకటించింది. తరువాత దశలో అంటే వచ్చే ఏడాదికి ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రారంభం కానుంది. కంటెంట్ ను అందుబాటులో ఉంచడానికి సంబంధిత వార్తా ప్రచురణ కర్తలకు సంస్థ చెల్లింపు కూడా చేయనుంది. ఆస్ట్రేలియాలో మాత్రం ఫేస్ బుక్ న్యూస్ సర్వీస్ ఉండదు. 


అమెరికాలో పేస్ బుక్ న్యూస్ ( Facebook news in america ) ప్రారంభించాక పురోగతి కన్పించింది. అందుకే రానున్న 6-12 నెలల్లో కొన్ని దేశాల్లో ఈ సేవల్ని ప్రారంభించనుంది. Also read: Telegram: సరికొత్త ఫీచర్ తీసుకొచ్చిన టెలిగ్రామ్.. త్వరలో మరో సదుపాయం