వాట్సాప్, జూమ్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న యాప్ ‘టెలిగ్రామ్’ (Telegram). ప్రముఖ మెస్సేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. కాల్స్ మాట్లాడుతుంటే మధ్యలో వీడియోను స్విచ్ ఆన్, స్విచాఫ్ చేసే సదుపాయాన్ని ఇకనుంచి టెలిగ్రామ్ అందించనుంది. దాంతోపాటు మరికొన్ని రోజుల్లో వీడియో గ్రూప్ కాలింగ్ సదుపాయాన్ని తీసుకొస్తామని, టెస్టింగ్ దశలో ఉన్నట్లు ఓ బ్లాగులో పేర్కొంది. Gold Price Today: అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
ప్రస్తుతం ఈ ఫీచర్ టెలిగ్రామ్ బీటా వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. బీటా వెర్షన్‌లో సక్సెన్ అయిన ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. అంతేకాదు.. వీడియో కాల్స్‌లో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్‌ను కూడా తెస్తున్నారు. వీడియో కాల్ మాట్లాడుతూనే ఏ ఇబ్బంది లేకుండా ఇతర యాప్స్‌ను యూజర్ వినియోగించుకోవచ్చు. . AP Inter Re-verification Results: ఏపీ ఇంటర్ రీ-వెరిఫికేషన్ ఫలితాలు విడుదల
వీడియో కాల్స్ విషయంలోనూ సెక్యూరిటీ పెంచేందుకు వీడియో కాల్స్‌ను ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసినట్లు టెలిగ్రామ్ తెలిపింది. ఇప్పటివరకూ ఆడియో కాల్స్ వరకే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేస్తున్నారు. వీడియో గ్రూప్ కాలింగ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టెలిగ్రామ్ తమ బ్లాగులో వెల్లడించింది. అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..