CCTV video: ఇంటి ముందు సీసీ కెమెరా పెట్టుకోవడం వల్ల ఓ కుటుంబం.. వేరే దేశం నుంచి కూడా ఇండియాలోని తమ ఇంటిని దొంగల బారి నుంచి కాపాడుకో (CCTV Usage) గలిగింది. ఉత్తర్​ ప్రదేశ్​లో చోటు చేసుకుంది ఈ ఘటన.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయమేమిటంటే..


ఉత్తర్​ ప్రదేశ్​ కాన్పూర్​కు చెందిన సాఫ్ట్​వేర్ ఇంజనీర్​ విజయ్ అవస్తీ అతడికుటుంబం ప్రస్తుతం అమెరికా న్యూ జెర్సీలో ఉంటుంది. అయితే కాన్ఫూర్​లో ఉన్న తమ ఇంటిని రక్షణకోసం సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకున్నారు. ఇంటర్నెట్​ ద్వారా లైవ్​లో ఎక్కడి నుంచైనా చూసుకునేలా ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి అలారం సిస్టం కూడా ఉంది.


ఈ ఫీచర్లన్నింటి కారణంగా.. ఇటీవల ఆ సీసీ కెమరా నుంచి విజయ్​ అవస్తీకి ఒక అలర్ట్ వచ్చింది. వెంటనే అప్రమత్తమై అవస్థీ.. సీసీ టీవీ ద్వారా వచ్చిన లైవ్​ ఫుటేడీని చూశాడు. అందులో కొందరు దొంగలు తమ ఇంట్లోకి చొరపడేందుకు ప్రయత్నిస్తూ కనిపించారు. దీనితో వెంటనే (Burglary Attempt) అప్రమత్తమైన అవస్థీ.. మైక్ ఆప్షన్​తో దొంగలను హెచ్చరించే ప్రయత్న చేశాడు. అయినా ఆ దొంగలు ఏ మాత్రం బయపడలేదు. పైగా ఆ సీసీ కెమెరాను ధ్వంసం చేశారు.


అప్పుడే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు విజయ్ అవస్థీ. పోలీసులు కూడా సమయానికి స్పందించి.. ఘటన స్థలికి చేరుకున్నారు. అయితే ఇది గమనించిన దుండగులు పోలీసులపైకి (Kanpur Police) కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దుండగుడికి గాయాలయ్యాయి.


గాయాలపాలైన దుండగుడు మినహా.. మిగతా దొంగలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. తమకు దొరికిన వ్యక్తి హమీన్​పూర్​ జిల్లాకు చెందిన సోనుగా గుర్తించారు. ఆ వ్యక్తి నుంచి ఇతర దొంగల సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.


ఈ ఘటన తర్వాత.. విజయ్ అవస్థీ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీసీపీ (ఈస్ట్) ప్రమోద్​ కుమార్ వెల్లడించారు. దొంగలు ఇంట్లో చొరబడి ఏమైన దోచుకెళ్లారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇండియాలోనే ఉంటే విజయ్ అవస్థీ అక్కలను పిలిపించి క్రాస్​ చెక్​ చేయించినట్లు కూడా వివరించారు.


విజయ్ అవస్థీ ఇంట్లో వేరేవాళ్లు అద్దెకు ఉంటున్నారని.. ఇటీవలే వారు ఊరికి వెళ్లినట్లు తెలిపారు పోలీసులు. దొంగలు ఈ విషయాలన్నింటిని గమనిస్తూనే పక్కా ప్రణాళికతో దోపిడికి ప్లాన్​ చేసినట్లు తెలుస్తోందని వివరించారు.


Also read: 555 carats black diamond: కోట్ల విలువైన ఈ 555 క్యారెట్ల బ్లాక్ డైమండ్ ఎక్కడిదో తెలుసా ?


Also read: Google Meet Wedding: గూగుల్ మీట్ లో పెళ్లికి ఆహ్వానం.. జొమాటో ద్వారా విందుకు ఏర్పాట్లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook