Google Meet Wedding: గూగుల్ మీట్ లో పెళ్లికి ఆహ్వానం.. జొమాటో ద్వారా విందుకు ఏర్పాట్లు!

Google Meet Wedding: కరోనా మహమ్మారి కారణంగా మన జీవన విధానంలో పెనుమార్పులు సంభవించాయి. సంప్రదాయబద్ధంగా జరగాల్సిన వివాహ వేడుకలూ వినూత్నంగా జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ్​ బంగాకు చెందిన ఓ జంట మరో అడుగు ముందుకేసింది. ఆన్‌లైన్‌ వేదికగా 450 మంది అతిథులతో పెళ్లి వేడుకలకు సిద్ధమైంది. అంతటితో ఆగకుండా.. ఆ అతిథులకు ఆన్ లైన్ పుడ్ డెలీవరీ జొమాటో ద్వారా విందు కూడా ఈ నూతన వధూవరులు ఇవ్వనున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 12:15 PM IST
Google Meet Wedding: గూగుల్ మీట్ లో పెళ్లికి ఆహ్వానం.. జొమాటో ద్వారా విందుకు ఏర్పాట్లు!

Google Meet Wedding: కరోనా కాలంలో కొత్త పద్ధతులు పాటించాల్సి వస్తోంది. ఆచారాలను మార్చుకోక తప్పడం లేదు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఆన్​లైన్​లోనే వివాహం జరుపుకుంది ఓ జంట. గూగుల్ మీట్ లో పెళ్లికి ఆహ్వానం ఇచ్చి.. జొమాటో ద్వారా విందు ఏర్పాటు చేసింది. వీరి పెళ్లికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

ఏం జరిగిందంటే?

పశ్చిమ బంగాల్‌లోని బుర్ద్వాన్‌ ప్రాంతానికి చెందిన సందీపన్‌ సర్కార్‌, అదితి దాస్‌.. ఏడాది క్రితమే పెళ్లి నిశ్చయమైంది. అయితే కరోనా ఆంక్షల కారణంగా పలుమార్లు వీరిద్దరి పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. ఆఖరికి ఈ నెల అనగా జనవరి 24న పెళ్లి పీటలెక్కాలని నూతన వధూవరులు నిర్ణయించుకున్నారు. 

అయితే పశ్చిమ బంగాల్ సహా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నానాటికి పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వరుడు సందీపన్ కరోనా బారిన పడ్డాడు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నాడు. అంతలోనే రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కారణంగా శుభకార్యాలకు అతిథులపై పరిమితి విధించిందా రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో బంధువులందర్నీ పిలిచి పెళ్లి చేసుకోవడం సాధ్యం కాని పని. అలా అని మళ్లీ వివాహ తేదీని వాయిదా వేయలేని పరిస్థితి.

గూగుల్ మీట్ లో పెళ్లి

ఇప్పుడు వీరిద్దరూ ఆన్ లైన్ పెళ్లి తంతు జరిపించాలని నూతన వధూవరులు నిర్ణయించుకున్నారు. అందుకోసం ఓ టెక్నికల్ మ్యాన్ ను కూడా నియమించుకున్నారు. పెళ్లి తేదీకి ఒక రోజు ముందు అతిథులందరికీ గూగుల్ మీట్ లో ఓ లైవ్ లింక్.. పాస్ వర్డ్ పంపించనున్నారు. ఆ లింక్ ద్వారా పెళ్లిని ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు వీలు కల్పించారు. 

జొమాటోలో విందు..

అయితే పెళ్లికి హాజరైన అతిథులకు విందును ఏర్పాటు చేయాలి కదా! దీని కోసం ఆ జంట విన్నూత్నంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు. జొమాటో యాప్‌ ద్వారా అతిథులందరికీ డిన్నర్‌ డెలివరీ చేసే ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమయ్యారు.  

Also Read: Snake Video: తలుపు మధ్యలో బుసలు కొడుతూ భయంకరమైన నాగుపాము...వీడియో వైరల్

Also Read: Monkey Drinking Coke: కూల్ డ్రింక్ ఇలా తాగాలిరా బచ్చా.. చూసి నేర్చుకో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News