Bull Urinated: ఆఫీసు ముందు సుస్సు.. రైతుపై కేసు, కోర్టులో జరిమానా
Bull Urinated In Front of Office: తన భూమిని లాగేసుకున్న సింగరేణి కాలరీస్ సంస్థ అందుకు తగిన నష్ట పరిహారం చెల్లించకపోవడంతో వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేక, బతుకు దెరువు కోసం మరొక ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు పడుతున్నామని సదరు రైతు సింగరేణి సంస్థ అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంచేశారు.
Bull Urinated In Front of Office: ఇదొక విచిత్ర ఘటన. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అభివృద్ధి పనుల కోసం చేపట్టిన భూ సేకరణలో భాగంగా సింగరేణి సంస్థ తన భూమిని తీసుకుందని.. కానీ ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదని నిరసన వ్యక్తంచేస్తూ సుందర్ లాల్ లోధా అనే ఒక గిరిజన రైతు భద్రాద్రి కొత్తగూడం జిల్లా ఇల్లందులో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాడు. ఈ ఆందోళనలో భాగంగా సదరు రైతు తన ఎడ్ల బండిని తోలుకొచ్చి కంపెనీ ఆఫీస్ గేటు ఎదుట రోడ్డు పక్కన నిలిపాడు.
తన భూమిని లాగేసుకున్న సింగరేణి కాలరీస్ సంస్థ అందుకు తగిన నష్ట పరిహారం చెల్లించకపోవడంతో వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేక, బతుకు దెరువు కోసం మరొక ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు పడుతున్నామని సదరు రైతు సింగరేణి సంస్థ అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంచేశారు. ఇదిలావుంటే, టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఆఫీసు ముందు ఆందోళన చేసే సమయంలోనే రైతు తీసుకొచ్చిన ఎడ్ల బండికి కట్టి ఉన్న ఎడ్లు కార్యాలయం ఎదుటే యూరినేట్ చేశాయి.
దీంతో తమ పరిసరాలు దెబ్బతిన్నాయని ఆగ్రహించిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఆఫీస్ సిబ్బంది సదరు రైతుపై న్యూసెన్స్ కేసు పెట్టినట్టు తెలుస్తోంది. ఎడ్ల బండితో వచ్చి ఆఫీస్ ఎదుట ఆందోళన పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేశాడని ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు సాక్ష్యంగా ఎడ్లు యూరిన్ పోస్తున్న సీసీటీవీ దృశ్యాలను తమ ఫిర్యాదుతో జతపరిచారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. రైతుపై ఐపిసీ సెక్షన్ 270 కింద కేసు నమోదు చేసి అతడిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో కేసు విచారణకు రాగా.. రైతు తమ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టి తమ విధులకు ఆటంకం కలిగించాడని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కార్యాలయ సిబ్బంది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ రైతుకు కోర్టు రూ. 100 జరిమానా విధించింది.