న్యూ ఢిల్లీ: టిక్‌టాక్‌ వీడియోలతో ( Tiktok videos ) ప్రపంచానికి పరిచయమైన టాలెంటెడ్ యూత్ ఎంతో మంది ఆ వీడియోలను తమ ప్రతిభను పది మందికి పరిచయం చేసేందుకు వినియోగిస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం అదే పనిగా టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఓ సెలబ్రిటీగా పేరు తెచ్చుకోవాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. అలా తాపత్రయపడే క్రమంలో కొంతమంది లిమిట్స్ దాటి ప్రవర్తించి లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. ఇంకొంతమంది ఏకంగా పోలీసుల చేతిలో బుక్ అవుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. ( రానున్న 10 రోజుల్లో 2600 ప్రత్యేక రైళ్లు )


సోనూ నాయక్ అనే యువతి అహ్మాదాబాద్‌లోని ఇసాన్‌పూర్ బ్రిడ్జిపై రాత్రి వేళ ఓ టిక్ టాక్ వీడియో చేసింది. నడిరోడ్డుపై కూర్చుని, పడుకుని మాట్లాడుతూ.. లాక్ డౌన్ ఎత్తేయాల్సిందిగా ప్రధాని మోదీని డిమాండ్ చేసినట్టుగా ఉన్న ఆ వీడియో పోలీసుల కంట పడింది. ఇంకేం లాక్ డౌన్ సమయంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నేరం కింద ఆ యువతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై రిలీజైనప్పటికీ.. తానెంత పెద్ద తప్పు చేశాననేది ఆ తర్వాతే ఆ యువతికి తెలిసొచ్చింది. అదండీ సంగతి!! జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..