Fish With Human Face : మీరు తినాలనుకున్న ఆహారం మీ వైపే వింతగా కళ్లప్పగించి చూస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఏంటి అర్ధం కాలేదా ? సరే ఉదాహరణకు మీరు చేపల ఫ్రై తినాలనుకుని మార్కెట్ కి వెళ్లి చేపలు కొని తెచ్చుకుని వాటిని వండటానికి సిద్ధమయ్యారు అనుకోండి... కానీ మీరు వండటానికి చేతిలోకి తీసుకున్న చేప మీ వైపే ఒక మనిషిలా చూస్తూ ఉంటే మీకెలా ఉంటుందో చెప్పండి. ఛ ఊరుకోండి... చేప మనిషిలా ఎందుకు ఉంటుంది అని అనుకుంటున్నారా ? ఐతే చాలామందిలా మీరు కూడా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఫిలిప్పీన్స్‌లో ఓ మహిళకు నిజంగానే ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పటిలాగే మార్కెట్లో చేపలు కొనుక్కొచ్చిన ఆ మహిళ.. ఆ చేపలను వండేందుకని ఒక చేపను చేతిలోకి తీసుకుంది. ఆ చేపలో ఆమెకు చేప తరహాలో కాకుండా ఏదో వింత ఆకారం కనిపించింది. ఏంటా అని ఇంకొంచెం తేరిపార చూసి షాకైంది. ఆ చేప అచ్చం మనిషి ముఖంలా ఉంది. పెదాలు, పెద్ద పెద్ద దంతాలు.. ఇలా ఏ విధంగా చూసినా అచ్చం మనిషి ముఖాన్ని చూసినట్టుగా అనిపించింది. ఆ సీన్ చూసి షాకైన ఆమె.. దాంతో వంట చేసుకుని తినాలన్న తన ఆలోచనను విరమించుకుంది. ఆ చేపను వంట చేస్తే.. అది తమకు తమ పిల్లలకు ఏదైనా అనారోగ్యం సమస్యలు తీసుకురావచ్చునేమో అనే భయంతో ఆ చేపను బయటపడేసింది.


ఫిలిప్పీన్స్ కి చెందిన మరియా క్రిస్టినా కుసి అనే మహిళకు ఈ వింత అనుభవం ఎదురైంది. మార్కెట్‌ లో తెచ్చుకున్న చేపల్లో దాదాపు ఒక కిలో బరువు ఉన్న ఒక చేప చూడ్డానికి అచ్చం వింతగా అనిపించింది. కుసి కొన్న చేప చివరికి బిగ్ హెడ్ కార్ప్ అని.. ఇది 60 అంగుళాల పొడవు వరకు పెరిగే ఫ్రెష్ వాటర్ ఫిష్ అని తెలిసింది.


ఒక మనిషి ముఖాన్ని పోలినట్టుగా దంతాలతో చేప కనిపించడటం ఇదేం మొదటిసారి కాదు. దక్షిణ అమెరికాలో పాకు జాతి పిష్ కూడా ఇలాగే మనిషి దంతాల తరహాలోనే ముఖం ఉంటుంది. అంతేకాదు.. ఒక మూడేళ్ల క్రితం కూడా ఇలాంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏదేమైనా .. తాజాగా ఫిలిప్పీన్స్ మహిళకు కనిపించిన ఈ ఫిష్ ఫోటో కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. చాలామంది ఈ ఫోటోను చూసి తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. ఇదే విషయాన్ని కామెంట్స్ రూపంలో వెల్లడిస్తున్నారు.