Fish saves his friend from snake attack video: సాధారణంగా ప్రతి ఒక్క జీవి కూడ ఏదో ఆహారంను తీసుకుంటాయి. క్రూర జంతువులు సాధు జంతువుల్ని తింటుంటాయి. సాధు జంతువులు గడ్డి ఇతర పదార్థాలను తింటుంటాయి. ఇది ఒక లైఫ్ సైకిల్. అయితే.. మనం తరచుగా పాములను గురించి సామాజిక మాధ్యమాలలో ఎక్కువగా చూస్తుంటాం. పాముల వీడియోలు ఎక్కడ ఏం జరిగిన.. సెకన్ లలో వైరల్ అవుతుంటాయి.  నెటిజన్లు సైతం పాముల వీడియోలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాములు అడవిలో ఎలుకల్ని, సాటి చిన్న పాముల్ని సైతం చంపి తింటుంటాయి. ఈ నేపథ్యంలో ఒక పాము వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒక పచ్చని పాము పెద్ద నదీ మీద ఉన్న కొమ్మపై వేలాడుతు ఉంది. మరీ అది నదీలో ఉన్నఏదైన జీవుల్ని తిందామని కూర్చుందో.. మరేంటో కానీ.. చాలా సేపటి నుంచి పాము అలానే కూర్చుని ఉంది. ఇంతలో ఒక చేప పామును చూసింది.



 


మరీ అదే తన వేట అనుకుందో కానీ.. ఒక్కసారిగా పాము మీదకు దూకి దాన్ని నోటితో పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఇంతలో అలర్ట్ అయిన పాము.. చేపను తన నోటితో పట్టేసుకుని రివర్స్ లో షాక్ ఇచ్చింది. దీంతో చేప పాపం.. విలవిల్లాడిపోయింది. పాము నోటిలో నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నించింది . కానీ పాము మాత్రం దాన్ని అస్సలు వదల్లేదు. ఇంతలో చేప రిస్క్ లో ఉన్న విషయాన్ని దాని ఫ్రెండ్ నీళ్ల నుంచి చూసినట్లుంది.


Read more: Viral Video: ఓర్ని.. ఇదేం పిచ్చి భయ్యా.. రీల్స్ కోసం ఇలా కూడా చేస్తారా..?.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..


అది ఒక్కసారిగా నీళ్ల నుంచి పైకి వచ్చి .. పాము నోట్లో ఉన్న చేపపై దూకి..పాము నోట్లో నుంచి చేప  కిందకు పడేలా చేసింది. పాము పట్టుతప్పిపొవడంతో చేప నీళ్లలోకి పడిపోయింది. దీంతో పాపం.. చేప ప్రాణాలు మాత్రం సెఫ్ అయినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు తన దోస్త్ కోసం చేప భలే రిస్క్ చేసిందంటూ కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు . దోస్తానా అంటే ఇది అంటూ ఫిదా అవుతున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.