Viral Video: ఓర్ని.. ఇదేం పిచ్చి భయ్యా.. రీల్స్ కోసం ఇలా కూడా చేస్తారా..?.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

Reels addiction: ఒక మహిళ మంటల దగ్గరకు వెళ్లి చేసిన పని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. కొంత మంది నెటిజన్ లు మాత్రం మహిళ తీరుపు ఏకీపారేస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 18, 2024, 08:32 PM IST
  • మహిళ చీరకు అంటుకున్న మంటలు..
  • తిట్టిపోస్తున్న నెటిజన్లు..
Viral Video:  ఓర్ని.. ఇదేం పిచ్చి భయ్యా.. రీల్స్ కోసం ఇలా కూడా చేస్తారా..?.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

woman caught fire reels while shooting video: ఇటీవల కాలంలో కొంతమంది జనాలకు రీల్స్, వీడియోల పిచ్చీ పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు. ఏదైన చేసి ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోవాలని ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారు. కొంత మంది రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పొస్ట్ లు చేస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పొర్టు అసలు.. ఎక్కడ పడితే అక్కడ రీల్స్ మోజులు నచ్చినట్లు పాడు పనులు చేస్తున్నారు. కొండలు, నదులు, సముద్రాల దగ్గరకు వెళ్లి నానా రచ్చ చేస్తున్నారు .

 

క్రూర జంతువుల దగ్గరకు వెళ్లి కూడా లైఫ్ ను రిస్క్ లో వేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది రీల్స్ చేస్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన వార్తలలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు..

ఒక మహిళ మరీ రీల్స్ చేస్తున్నట్లు ఉంది. ఆమె రాత్రి పూట మంటల ముందు చలికాపుకుంటున్నట్లు ఫోజులు ఇస్తు రీల్స్ చేసుకుంటుంది. ఇంతలో ఏమైందో కానీ..ఒక్కసారిగా ఆమె చీర కొంగుకు మంటలు అంటుకున్నాయి. అప్పుడు ఆమె హెల్ప్... హెల్ప్.. అంటూ అక్కడి నుంచి పరుగులు పెట్టింది. నిప్పులు వేగంగా చీరకు వ్యాపించడంతో.. చీరను వదిలేసి మరోచోటకు పారిపోయింది.

కొంత మంది ఆమె చీరకు అంటుకున్న మంటల్ని అదుపులోకి చేసేందుకు ప్రయత్నించారు .. కానీ మంటులు మాత్రం వేగంగా వ్యాపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. మొత్తానికి ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.

Read more: Viral Video: వామ్మో.. పెంపుడు శునకం పీక పట్టుకున్న చిరుత.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. వీడియో వైరల్..

దీన్ని చూసిన నెటిజన్ లు ఆమె చేసిన పనికి తిట్టిపొస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి పనులు చేయడం మానుకొవాలని ఫైర్ అవుతున్నారు. ఆచీరకు మంటలు అంటుకొవడం కూడా స్టంట్ కావొచ్చని కొందరు డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News