Fish rain in iran people are collecting fish on road video goes viral: కొన్నిరోజులుగా జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. సూర్యుడి మండిపోతు తన ప్రతాపం చూపిస్తున్నాడు. జనాలు బైటకు వెళ్లాలంటేనే అల్లాడిపోతున్నారు.ఉదయం నుంచి, మధ్యాహ్నాం మాదిరిగానే ఎండలు మండిపోతున్నాయి. బైటకు వెళ్లిన వారు డీహైడ్రేషన్ సమస్యలకు గురౌతున్నారు. అంతేకాకుండా, అవసరంలేకుండా అస్సలు బైటకు వెళ్లొద్దని కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది వడదెబ్బ ప్రభావానికి గురయ్యారు. వడదెబ్బ ప్రభావానికి జనాలు పిట్టల మాదిరిగా రాలిపోయారు. ఒక మనదేశంలో కాకుండా ఈసారి అనేకచోట్ల ఎండలు పీక్స్ కు చేరిపోయాయి. ఇదిలా ఉండగా.. వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కొన్నిరోజులుగా మండిపోయిన భానుడు మరీ రెస్ట్ తీసుకున్నాడో.. మరేందో కానీ .. అనేక చోట్ల భారీగా వర్షంకురిసింది. రోడ్లన్ని నీళ్లతో నిండిపోయాయి. ఎండతో అల్లాడిపోయిన జనాలు వర్షంతో కాస్తంతా ఉపశమనం పొందినట్లుభావించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఇరాన్ లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఆకాశంలో నుంచి చేపల వర్షం కురిసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


కొన్నిసార్లు రోడ్డుమీద వైన్ బీర్ల బాటిళ్లతో వెళ్లున్న లారీలు ప్రమాదాలు జరిగి బోల్తాపడిన ఘటనలు జరుతుంటాయి. కోళ్లతో వెళ్తున్న లారీలు, పెట్రోల్ తో వెళ్తున్న లారీలు కూడా ప్రమాదానికి గురైన ఘటనలు కొకొల్లలు. ఇలాంటి సమయంలో రోడ్డుపైన పడిన వాటిని ఎత్తుకెళ్లేందుకు అక్కడున్న వారు పోటీపడుతుంటారు. ప్రమాదంలో గాయపడిన వారిని అస్సలుపట్టించుకోరు. అక్కడున్న వస్తువులతో నిముషాలలో ఎస్కెప్ అయిపోతుంటారు. ఇక్కడ కూడా రోడ్డుమీద పడిన చేపలను పట్టేసుకుని అక్కడి నుంచి జనాలు వెళ్లిపోయారు.


Read More: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...


సాధారణంగా చాలా అరుదుగా ఆకాశం నుంచి చేపలు పడటంవంటి సంఘటనలు జరుగుతుంటాయి. తుఫానులు సంభవించి, సముద్రంలోని నీళ్లపైన సుడిగుండం మాదిరిగా ఏర్పడుతుంది. దీనితో చేపలన్ని ఆకాశంలోకి వెళ్లిపోతాయంటారు. ఆతర్వాత ఎక్కడైన  కుండపోతగా వర్షంకురిసినప్పుడు చేపలన్ని తిరిగి కిందకు పడుతుంటాయి. కొన్నిసార్లు తిరిగి సముద్రంపైన చేపలు పడోచ్చు. మరికొన్నిసార్లు..రోడ్లమీద పడోచ్చు. ఇరాన్ లోని యూసుజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా భారీగా వర్షం కురిసి, రోడ్డుమీద కుప్పలుగా చేపలు పడ్డాయి. దీన్న ఏరుకోవడానికి అక్కడి వారు పోటీ పడ్డారు. నాకంటే.. నాకు అంటూ చేపల కోసం ఎగబడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter