Four Years Boy Swallowed the Battery: పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు పిల్లలు తమ నోట్లో ఏవి అంటే అవి పెట్టుకుంటూ ఉంటారు. పొరపాటున అవి నోటిలో నుంచి కడుపులోకి వెళ్లిపోవడం... లేదంటే పొరపాటున పిల్లలు వాటిని మింగడం వంటివి చేస్తుంటారు. దీని వల్ల పిల్లలు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. చెన్నైలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. వైద్యులు దాదాపు 14 గంటల పాటు శ్రమించి.. ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 చెన్నై రీలా హాస్పిటల్‌లోని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆర్ రవి ప్రకారం..  చెన్నైలో నాలుగేళ్ల బాలుడు ఒక పెన్సిల్ బ్యాటరీని మింగాడు. అయితే అదృష్టవశాత్తూ, ఆ బాలుడు వెంటనే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో ప్రాణాలతో బయపడ్డాడు. 5 సెంటీమీటర్ల పొడవున్న బ్యాటరీని ఈ చిన్నారి మింగాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే కొడుకును డాక్టర్ వద్దకు తీసుకొచ్చారు. 


ఏమాత్రం ఆలస్యమైనా కూడా చిన్నారి ప్రాణాలకే ప్రమాదం ఉండేది. ఆ చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ రిమోట్‌ కంట్రోల్‌లో ఉపయోగించేటటువంటి బ్యాటరీని ప్రమాదవశాత్తు మింగేశాడు. కడుపులో బ్యాటరీ ఉన్నట్లు ఎక్స్ రేలో తేలింది. 


చిన్నారి కడుపులో ఇరుక్కున్న బ్యాటరీని బయటకు తీసేందుకు దాదాపు 14 గంటల పాటు డాక్టర్లు శ్రమించారు. 5 సెంటీమీటర్ల పొడవు.. 1.5 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఈ  బ్యాటరీని ఆ చిన్నారి మింగేశాడు.


ఇక ఈ బ్యాటరీని బయటకు తీసేందుకు డాక్టర్లు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఏ మాత్రం అటుఇటూ అయినా ఆ చిన్నారి అంతర్గత అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. రోత్ నెట్‌తో ఎండోస్కోపీ చేసి డాకర్లు ఈ చికిత్స నిర్వహించారు. మొత్తానికి డాక్టర్లు ఎంతో కష్టపడి ఆ బ్యాటరినీ చిన్నారి కడుపులో నుంచి బయటకు తీయగలిగారు. 


అయితే చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్ రవి తెలిపారు. పిల్లలు వారికి తెలియకుండానే బటన్స్, కాయిన్స్‌, బ్యాటరీలు వంటి చిన్న చిన్న వస్తువులను నోట్లో పెట్టుకోవడం ప్రమాదకరమని చెప్పారు. ఇలాంటవన్నింటినీ చిన్నారులు వారికి తెలియకుండానే మింగేస్తారన్నారు. అందువల్ల ఇలాంటి వాటిని చిన్న పిల్లలకు వీలైనంత దూరంగా ఉంచాలని డాక్టర్ పేర్కొన్నారు.


Also Read: Anchor Anasuya Eye Winking: కుర్రకారుకు కన్నుకొట్టిన యాంకర్ అనసూయ- ఫొటోలు వైరల్


Also Read: Lavanya Tripathi Photos: వాలెంటైన్స్ డే మూడ్ లో 'అందాల రాక్షసి' లావణ్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook