Sleeping on Stomach: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ నిద్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. సరైన నిద్ర ఉంటేనే రోజంతా ఆరోగ్యంగా ఉంటారు. రోజుకు కంటికి సరిపడ నిద్ర ఉంటే మెదడుకు ప్రశాంతత ఉండడమే కాకుండా.. అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే రోజు మొత్తం ఎంతో చురుకుగా ఉంటారు.
అయితే చాలామంది తమ ఇష్టానుసారమైన క్రమంలో నిద్రపోతుంటారు. కానీ నిజానికి ఎడమ చేతిని తల కింద దిండుగా పెట్టి ఎడమవైపు పడుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలాగే ఎడమవైపు పడుకోవడం వలన ఎక్కువ సేపు నిద్రించడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలా మందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. అలా బోర్లా పడుకోవడం వల్ల వెంటనే నిద్ర పడుతుందని కొందరి నమ్మకం. కానీ, అలా బోర్లా నిద్రించడం చాలా ప్రమాదకరం. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.
మూర్ఛ రోగులకు ప్రమాదం
మూర్ఛ వ్యాధితో బాధింపబడే వారు నిద్రించే సమయంలో బోర్లా పడుకోకపోవడమే మంచిది. అలా పడుకుంటే మరణం సంభవించవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలో చాలా మంది ఇలా పడుకోవడం వల్ల మరణాలు సంభవించినట్లు తెలిపారు.
పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 మిలియన్ల మంది మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. ఇల్లినాయిస్‌లోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జేమ్స్ టావో ప్రకారం, అనియంత్రిత మూర్ఛలో మరణం సాధారణంగా నిద్రలో సంభవిస్తుంది. ఈ పరిశోధన కోసం 253 మంది వ్యాధిగ్రస్తులపై పరిశోధన చేశారు. ఈ అధ్యయనం ప్రకారం.. 73 శాతం మంది మూర్ఛ వ్యాధిగ్రస్తులు బోర్లా పడుకోవడం వల్ల మరణించినట్లు ఆ అధ్యయనాలు తెలిపాయి.
Also Read: Chocolate Day 2022: చాక్లెట్ డే సందర్భంగా మీరు ఇష్టపడే వారికి ఈ బహుమతులు ఇవ్వండి!
Also Read: Propose Day 2022: ప్రపోజ్ డే ప్రాముఖ్యత.. ఈ రోజున మీ ప్రేమను అసలు మిస్ కావొద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook