Puppy Bath Video: కుక్క పిల్లకి మొదటిసారి స్నానం..16 లక్షల మంది ఎందుకు చూసారో తెలుసా?
Puppy reaction goes viral after bathing. ఓ యజమాని తన చిన్ని కుక్కకు స్నానం చేయిస్తే అది ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ అయింది.
Cute Puppy reaction goes viral after bathing for First Time: ఇటీవలి కాలంలో ప్రతి ఇంటిలో పిల్లలు ఉంటున్నారో లేదో తెలియదు కానీ.. కుక్కలు మాత్రం పక్కాగా ఉంటున్నాయి. కొందరు అయితే రెండు మూడు కూడా పెంచుకుంటున్నారు. వాటిని సొంత పిల్లల మాదిరే చూసుకుంటారు. మంచి భోజనం, బెడ్ సమకూర్చడమే కాకుండా సమయానికి వాక్సిన్ కూడా ఇప్పిస్తూ అపురూపంగా చూసుకుంటారు. కుక్కలకు స్నానం చేయించి శుభ్రంగా కూడా ఉంచుతారు. అయితే ఓ యజమాని తన చిన్ని కుక్కకు స్నానం చేయిస్తే అది ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ అయింది.
యజమాని తన కుక్క పిల్లకి మొదటిసారి స్నానం చేయించడానికి ఇంట్లోని బాత్ టబ్ వద్దకు తీసుకుకెళ్లారు. టబ్‌లో కొద్దిగా నీళ్లు పట్టి అందులో షాంపూ వేశారు. కుక్క పిల్లని టబ్‌లో వేయగానే నీటిలో మునగడంతో అది ఒక్కరిగా భయపడిపోయింది. పైకి లేచి తన ముందు కాళ్లతో యజమాని చేయి పట్టుకుంది. యజమాని కుక్క పిల్లని టబ్‌లో వేసేందుకు ప్రయత్నించినా అది వదలేదు.
కుక్క పిల్లక మొదటిసారి స్నానం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో కుక్క పిల్ల అమాయకత్వానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను బ్యూటెంగెబిడెన్ అనే ట్విట్టర్ ఖాతాతో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 16 లక్షల మంది వీక్షించారు. కుక్క పిల్ల రియాక్షన్ చూసి సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
నిజానికి మనుషులకు కుక్కలతో మంచి అనుబంధం ఉంది. అదే సమయంలో కుక్కలకు కూడా మనుషులంటే చాలా ఇష్టం. తమ యజమానులపై అవి ఎంతో ప్రేమ చూపిస్తాయి. యాజమాని ఏది చెపితే అది చేస్తాయి. కుక్కలను విశ్వాసపు జంతువు అని కూడా అంటారు.
Also Read: KKR vs LSG: ఎవిన్ లూయిస్ అత్యద్భుతమైన క్యాచ్, కేకేఆర్ ఓటమికి కారణం అదే
Also Read: IPL 2022 Do or Die Match: గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ డూ ఆర్ డై మ్యాచ్ నేడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook