Funny Video: కొమ్ములున్నాయి కదా అని విర్రవీగితే ఏం జరుగుతుందో ఈ ఫన్నీ వీడియో చూడండి!
Funny Video: ఫన్ని వీడియోలకు ఇంటర్నెట్లో కొదవే లేదు. ఆ జాబితాలోని ఓ కొత్త వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి ఆ వీడియోను చూసేద్దామా?
Funny Video: ఇంటర్నెట్లో రోజూ కొన్ని వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో ఎక్కువ శాతం జంతువులకు సంబంధించినవే (Funny Animal Video) ఉంటాయి.
ఎందుంకంటే.. జంతువులు చేసే కొన్ని చిలిపి పనులంటే అందరూ చాలా ఇష్టపడుతుంటారు.
అందుకే ఇంటర్నెట్లో వైరల్ అయ్యే జంతువుల వీడియోల్లో చాలా వరకు.. ఫన్నీ పనులు చేస్తున్నవే ఉంటాయి. కొన్ని సార్లు వేర్వేరు రకాల జంతువులు మధ్య స్నేహం, మరికొన్ని సార్లు అవి చూపించే విశ్వాసానికి సంబంధించిన వీడియోలు ట్రెండవుతున్నాయి.
ఇక తాజాగా ఓ గొర్రెకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో (Sheep Funny Video) ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఏముందంటే..
సాధారణంగా జంతువులు ఏదైనా కొత్త వస్తువులను చూస్తే విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి అనుభవమే ఓ గొర్రెకు ఎదురైంది. దూరంగా పడి ఉన్న ఓ నల్ల రంగు ప్లాస్టిక్ టబ్‌ను చూసి తనకేదో హాని ఉందని భావించినట్లుంది ఆ గెర్రె. అంతే ఆ ప్లాస్టిక్ టబ్ పై దాడికి దిగింది.
ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్సాస్టిక్ టబ్పైకి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి.. దాని తలతో టబ్‌ను గుద్దడంతో.. ఆ టబ్‌లో తల ఇరుక్కుని.. గొర్రె బోల్తా పడింది. మళ్లీ లేచే సరికి ఆ టబ్ పక్కకు పడింది.
ఆ టబ్ తనకంటే బలమైందని అనుకుందో ఏమో గానీ.. మరోసారి దానిపై దాడి చేయడానికి మాత్రం ఆ గొర్రె సాహసం (Sheep Funny Fight with plastic tub) చేయలేకపోయింది.
ఈ ఫన్నీ ఘటనను అక్కడే ఉన్న కొంత మంది వీడియోలో చిత్రికరించారు. ఆ వీడియోను animalcritter అనే ఇన్‌స్టా పేజీలో 4 రోజుల క్రితం అప్లోడ్ చేయగా.. ఇప్పటి వరకు 32 లక్షల మందికిపైగా వీక్షించారు. మరి ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.
Also read: Monkey Gives a Hug: మనిషిని హత్తుకుంటూ భావోద్వేగానికి లోనైనా కోతి
Also read: Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. మొసలి దాడి.. తెలిసి తెలిసి ప్రాణాల మీదకు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook