Funny Viral Video: పెళ్లిపందిరిలో కోపంతో పెళ్లి కుమార్తె ఎంత పని చేసిందో చూడండి!
Funny Viral Video: పెళ్లిలో జరిగే ఫన్నీ వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. అందులో నూతన వధూవరుల మధ్య జరిగే చిలిపి సంఘటనలు భలే ఫన్నీగా ఉంటాయి. అందుకు సంబంధించిన వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
Funny Viral Video: పెళ్లి అంటే ఆనందం, సంతోషం, సంబరాలు, భావోద్వేగాలు అన్నీ కలిసి ఉంటాయి. పెళ్లిలో ఇరు కుటుంబాల మధ్య గౌరవం.. సరదాగా ఆటపట్టించుకోవడాలు వంటివి సహజంగా జరుగుతుంటాయి. ఇలా కోలాహలంగా జరగాల్సిన ఓ పెళ్లి ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది. వివాహం రోజున సంతోషంగా ఉండాల్సిన నూతన వధూవరులు పెళ్లి వేదికపైనే గొడవ పడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్వీట్ ను విసిరిన వధువు..
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. పెళ్లి వేదికపై నూతన వధూవరులు నిలబడి ఉన్నారు. పెళ్లి తంతు ముగిసిన వధూవరుల మధ్య కొన్ని సరదా గిల్లికజ్జాలు అవ్వడం సాధారణం. కానీ, అవి శ్రుతిమించి అహాన్ని తీసుకునే విధంగా చేశాయి. పెళ్లిలో వధూవరులు భోజనం చేయడం ఆనవాయితీ.
ఆచారం ప్రకారం.. వరుడు తన చేతులతో వధువుకి స్వీట్ తినిపించాలి. కానీ, అనుకోకుండా వధువుకు కోపంతో తనకు తినిపిస్తున్న స్వీట్ ను కోపంతో విసిరి వేయడం జరిగింది. ఆ తర్వాత వధువు.. వరునికి గ్లాస్ తో నీరు తాగించాల్సి ఉంది. అయితే, అప్పుడు వరుడు కూడా టిట్ ఫర్ టాట్ విధంగా తాను గ్లాస్ ను పక్కకు తోశాడు. దీంతో కోపం తెచ్చుకున్న పెళ్లికుమార్తె గ్లాస్ ను పెళ్లి వేదిక నుంచి దూరంగా విసిరింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోపై పలువువరు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Currency Note Bidding: అవును.. ఆ కరెన్సీ నోటు విలువ ఏకంగా రూ. 1.30 కోట్లు!
Also Read: Tattoo on Face: మద్యం మత్తులో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి- వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.