ప్రపంచంలో నిత్యం ఎక్కడో ఏదోటి జరుగుతూ ఉంటుంది. వాటికి సంబంధించిన వీడియోలు (Viral Videos ) లేదా ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. పాత కాలంలో అంటే కెమెరాలు, సోషల్ మీడియా సైట్లు, ఈ టెక్నాలజీ లేని సమయంలో కూడా ఎన్నో వింతలు జరిగే ఉంటాయి. అయితే వాటిని రికార్డు చేసే సౌలభ్యం లేకపోవడంతో అవి మనకు కనిపించే అవకాశం లేకుండా పోయింది. కానీ లక్కీలీ నేటి సాంకేతికత మనముందు ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించేలా చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ| Happy Life: సంతోషంగా ఉండాలంటే ఇలా చేసి చూడండి


అలా మనం నిత్యం కొత్త కొత్త వీడియోలు ( Trending Videos ) చూస్తున్నాం. అందులో అమాయక జంతువులు చేసే చిలిపి చేష్టల వీడియోలు చూస్తూ నవ్వి కాస్త సేద తీరుతాం. ఈ రోజు మీకు అలాంటి కొన్ని వీడియోలు చూపిస్తాం. ఇందులో మీకు కావాల్సిన ఫన్ ఉంటుంది.  వాటిని చూసి మీరు వావ్ అనకుండా ఉండలేరు.


స్టోర్ లోకి దూసుకెళ్లిన పక్షి
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలా (Social Media ) బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎక్కడితో తెలియదు కానీ.. ఇందులో కంటెంట్ మాత్రం చాలా మందిని నవ్విస్తోంది. ఇందులో ఒక పక్షి మెల్లిగా నెమ్మదైన అడుగులు వేస్తూ ఒక స్టోర్ లోకి ప్రేవేశిస్తుంది. చడీ చప్పుడు లేకుండా.. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగింది అంటారు చూడండి.. అలా తనపనిని చేయాలని ముందుకెళ్తుంది.


అది ప్రవేశించిన స్టోర్ లో ఒక స్టాండ్ లో ఉన్న చిన్న ఫుడ్ ప్యాకెట్ ను నోట కరుచుకుని.. తుర్రుమని అక్కడిని నుంచి వెళ్లిపోతుంది. ఎంత నెమ్మదిగా వచ్చిందో... అంతే వేగంగా క్షణాల్లో మాయం అవుతుంది. అదే సమయంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ తతంగం మొత్తం వీడియో తీశాడు కాబట్టి మనకు తెలిసింది. లేదంటే పక్షులు ఇలాంటి పనులు కూడా చేస్తాయి అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి.




ALSO READ| Own Business: తక్కువ పెట్టుబడితో పుట్టగొడుగుల వ్యాపారంHome Making : బల్లులతో ఇబ్బందా.. ఇలా చేయండి


చెరుకు చోరీ చేసిన గజరాజు
చీమలకు చెక్కర అంటే ఇష్టం. ఏనుగులకు (Elephant ) చెరుకులు అంటే ఇష్టం. అందుకే అడవి ప్రాంతాలకు దగ్గరిలో చెరుకు పంటలను వేయాలి అంటే రైతులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఏనుగులు వాటిని తినడానికి గుంపులు గుంపులుగా వచ్చి పంటను నాశనం చేస్తాయి అని వారి భయం.  ఈ వీడియోలో రెండు ఏనుగులు వేరు వేరు లారీలో ఎక్కడికో వెళ్తుంటాయి. అయితే ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో లారీలు ఆగుతాయి.


లక్కీగా ఏనుగులు లారీకి పక్కనే నిండా చెరుకు ముక్కలతో ఉన్న లారీ ఆగుతుంది. అది గమనించిన ఏనుగులు ఇదే ఛాన్స్ అనుకుని చెరుకుగడలను తినడం ప్రారంభిస్తాయి. ఒకదాని తరువాత ఇంకొకటి..దాని తరువాత మరొకటి.. ఇలా నచ్చినంతా తిన్నాక కాస్త బ్రేక్ తీసుకుంటాయి. ఇంతలోనే సిగ్నల్ తొలగిపోవడంతో లారీలు ముందుకు కదులుతాయి.



ALSO READ|  WhatsApp Banking: వాట్సాప్ తో బ్యాంకింగ్ చేసేయండి.. మీ బ్యాంకు వ్యాట్సాప్ నెంబర్లు ఇవే


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN.IN డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR