Genelia- Riteish Video: భర్తను చితక్కొట్టిన బాలీవుడ్ హీరోయిన్, వీడియో వైరల్
Genelia- Riteish: బాలీవుడ్ కపుల్ జెనీలియా, రితేష్ దేశముఖ్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా వీరిద్దరూ కలిసి చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Genelia- Riteish Dance video Viral : 'బొమ్మరిల్లు'’ సినిమాతో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది జెనీలియా (Genelia). ఆ తర్వాత టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి...మెప్పించింది. ఇక్కడి నుంచి బాలీవుడ్ షిప్ట్ అయిన ఈ భామ అక్కడ కూడా విజయాలను అందుకుంది. ఈ క్రమంలో హీరో రితేశ్ దేశ్‌ముఖ్ (Riteish Deshmkh)తో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది.
తల్లైన అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది జెన్నీ. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో (Social media) మాత్రం యమ యాక్టివ్ గా ఉంటుంది. తన భర్త రితేష్ తో కలిసి జెనీలియా చేసే వీడియోలు నెట్టింట తెగ హాల్ చల్ చేస్తుంటాయి. తాజాగా ఈ కపుల్ మరో వీడియోతో నెట్టింట సందడి చేస్తున్నారు.
వీడియో ఓపెన్ చేస్తే.. `నాచ్ నాచ్ నాచ్` అనే పాటకు జెన్నీ, రితీష్ ఇద్దరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మధ్యలో జెన్నీ డ్యాన్స్ చేయడం ఆపేస్తుంది..కానీ రితేష్ మాత్రం డ్యాన్స్ ఆపడు. దీంతో జెన్నీకి కోపం వచ్చి.. రితీష్ ని తోస్తుంది. అతడు జెన్నీని పట్టించుకోకుండా డ్యాన్స్ కొనసాగిస్తాడు. ఇక తన కోపాన్ని ఆపుకోలేని జెనీలియా.. భర్తను చితక్కొట్టుడు కొడుతోంది. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. త్వరలోనే జెనీలియా నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈచిత్రాన్ని రితేష్ స్వయంగా నిర్మించడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook