Young Boys scared after seeing Chudail on Dark Road: ఈ భూ లోకంలో దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్న ఇప్పటిది కాదు. ఇప్పటివరకు ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదు. దెయ్యాలు ఉన్నాయని కొంతమంది అంటే.. దెయ్యాలూ లేవు భూతాలు లేవని మరికొందరు అంటారు. అయితే సెర్చ్ ఇంజన్ గూగుల్‌లో వెతికితే మాత్రం ఎన్నో వీడియో కనిపిస్తాయి. మాకు నిజంగానే దెయ్యం కనిపించిందని, నేను దెయ్యం బారిన పడ్డానని, దెయ్యం నా పక్కనే నిలబడింది అంటూ ఎన్నో వీడియోలు కనిపిస్తాయి. వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... రాత్రి వేళ చీకటి రోడ్డులో ఓ ముగ్గురు యువకులు డ్రైవింగ్ చేసుకుంటూ వెళతారు. దారి మధ్యలో వారికి తెల్లటి చీరలో ఉన్న ఒక చుడైల్ (ఆడ దెయ్యం) కనిపిస్తుంది. మొదటిసారి కనిపించి పక్కన ఉన్న మరో దారి గుండా వెళుతుంది. దాంతో ఆ యువకులు భయపడిపోతారు. బైక్ నడిపే వ్యక్తి మెల్లగా ముందుకెళ్లి ఆ మహిళను దాటుకుంటూ వెళ్లి చుడైల్ అని నిర్ధారించుకుని అక్కడి నుంచి త్వరగా పారిపోవడానికి ప్రయత్నిస్తాడు .


ఈ క్రమంలో ముగ్గురూ బండిపై కొంచెం ముందుకు వెళ్లగానే.. ఈసారి నడి రోడ్డుపై వెంట్రుకలు ఈరబోసుకుని ఆడ దెయ్యం కనిపిస్తుంది. దాంతో వెనకాల ఉన్న ఇద్దరు యువకులు వెంటనే బైక్ దిగి.. బండిని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. ఓ యువకుడు తన ఫోన్ తీసి వీడియో తీస్తాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో మీమ్ పేజీలో షేర్ చేయబడింది. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ దెయ్యం వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇది ఫ్రాంక్ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. 



Also Read: CWG 2022: భారత్‌ ఖాతాలో మరో గోల్డ్ మెడల్.. రికార్డు సృష్టించిన 19 ఏళ్ల జెరెమీ!


Also Read: August 1st: రేపటి నుంచి అమలుకానున్న కొత్త నిబంధనలు..స్పెషల్ స్టోరీ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook