August 1st: మనిషి జీవితంలో ఒకటో తారీఖుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటు ప్రభుత్వాలు సైతం ఒకటో తేదీన కొత్త నిబంధనలను అమలు చేస్తుంటాయి. ఈసారి ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ అమలు కానున్నాయి.
ఐటీ రిటర్న్..
2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఐటీ రిటర్న్‌లు సమర్పించేందుకు ఇవాళే చివరి రోజు. గడువు పెంచే పరిస్థితి కూడా కనిపించడం లేదు. రేపటి నుంచి ఐటీ రిటర్న్‌లను నమోదు చేస్తే జరిమానాలు, ఆలస్య రుసుములు కట్టక తప్పదు.
పీఎం కిసాన్..
ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ గడువు నేటితో ముగియనుంది. రేపటి నుంచి ఎలాంటి అప్‌డేటింగ్ ఉండదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
పీఎంఎఫ్‌బీవై..
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం రిజిస్ట్రేషన్లు ఇవాళ్టితో ముగియనున్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకోని వారికి పథకం వర్తించదు. మరోవైపు రిజిస్ట్రేషన్ ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఎల్‌పీజీ గ్యాస్..
ప్రతి నెలా ఒకటో తేదీని గ్యాస్ ధరలను చమురు సంస్థలు మారుస్తుంటాయి. ఈసారి మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా..
రేపటి నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా సరికొత్త సదుపాయాన్ని అమలు చేయనుంది. ఆర్‌బీఐ ఆదేశాలతో రూ.5 లక్షలు అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం పాజిటివ్ పే సిస్టమ్‌ను తీసుకొచ్చింది. దీనిని రేపటి నుంచి ఆచరణలో పెట్టనుంది.
Also read:India vs West Indies: రేపే భారత్, విండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్..టీమిండియా జట్టు ఇదిగో..!
Also read:Telangana Rains: తెలంగాణకు ఐదు రోజులపాటు భారీ వర్ష సూచన..పిడుగులు పడే ప్రాంతాలు ఇవే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook