CWG 2022: భారత్‌ ఖాతాలో మరో గోల్డ్ మెడల్.. రికార్డు సృష్టించిన 19 ఏళ్ల జెరెమీ!

CWG 2022, Jeremy Lalrinnunga bags Gold In Mens 67kg. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డు ప్రదర్శనతో తొలి పసిడిని అందించగా.. తాజాగా వెయిట్‌ లిఫ్టర్‌ జెరెమీ లాల్‌రిన్నుంగా కూడా గోల్డ్ మెడల్ అందించాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 31, 2022, 06:20 PM IST
  • భారత్‌ ఖాతాలో మరో గోల్డ్ మెడల్
  • రికార్డు సృష్టించిన 19 ఏళ్ల జెరెమీ
  • పతాకలన్నీ వెయిట్ లిఫ్టింగ్‌లోనివే
CWG 2022: భారత్‌ ఖాతాలో మరో గోల్డ్ మెడల్.. రికార్డు సృష్టించిన 19 ఏళ్ల జెరెమీ!

Indian Weightlifter Jeremy Lalrinnunga bags Gold In Mens 67kg Final: ఇంగ్లండ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో భారత అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. ఇప్పటికే వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డు ప్రదర్శనతో తొలి పసిడిని అందించగా.. తాజాగా వెయిట్‌ లిఫ్టర్‌ జెరెమీ లాల్‌రిన్నుంగా కూడా గోల్డ్ మెడల్ అందించాడు. మూడో రోజు ఈవెంట్స్‌లో 67 కేజీల విభాగంలో 19 ఏళ్ల జెరెమీ రికార్డు సృష్టిస్తూ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 

పురుషుల 67 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్‌రిన్నుంగా స్నాచ్‌లో 140 కేజీల బరువు ఎత్తాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మొదటి ప్రయత్నంలో 154 కేజీలు ఎత్తిన జెరెమీ.. రెండో ప్రయత్నంలో ఏకంగా 160 కేజీలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 300 కేజీలుకు పైగా ఎత్తి రికార్డు సృష్టించాడు. ఇది కామన్‌వెల్త్ క్రీడల్లో సరికొత్త రికార్డు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జెరెమీ ఏకంగా గోల్డ్ మెడల్ సాధించడం విశేషం.

జెరెమీ  లాల్‌రిన్నుంగా బంగారు పతకం సాధించడంతో మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరగా.. మొత్తం పతకాల సంఖ్య ఐదుకు చేరింది. భారత్‌ ఇప్పటివరకు సాధించిన పతాకలన్నీ వెయిట్ లిఫ్టింగ్‌లోనివే కావడం విశేషం. మీరాబాయ్‌ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణం, 55 కేజీల విభాగంలో సంకేత్‌ మహదేవ్‌ సార్గర్‌ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్‌ పూజారి కాంస్యం గెలిచారు. ఈరోజు జెరెమీ లాల్‌రిన్నుంగా 67 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాడు.

Also Read: నెల రోజులైనా కాకముందే.. ఓటీటీలోకి రామ్‌ 'ది వారియర్‌'! స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా

Also Read: Anagaraka Yoga: అంగారక యోగంతో ఈ 5 రాశుల వారికి పొంచి ఉన్న ముప్పు.. ఆగస్టు 10 వరకు జాగ్రత్తగా ఉండాలి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

 

Trending News