Girl Dance Video: ఇంటర్నెట్ ప్రపంచంలో రకరకాల వీడియోలు, గమ్మత్తైనవి..నవ్వించేవి, కవ్వించేవి, భయపెట్టేవి చాలా వైరల్ అవుతుంటాయి. అటువంటిదే ఈ వీడియో. డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయిపై గుర్రానికి కోపమెందుకొచ్చింది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజూ వేలాది వీడియోలు వివిధ రకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్‌లోడ్ అవుతుంటాయి. కొన్ని చాలా వేగంగా వైరల్ అవుతుంటాయ. భయపెట్టేది కావచ్చు లేదా నవ్వించేది కావచ్చు లేదా గమ్మత్తైంది కావచ్చు..కంటెంట్ బాగుంటే చాలు వీడియో వైరల్ కావడం ఖాయం. అలాంటిదే ఈ వీడియో. ఈ వీడియో ఓ అమ్మాయి డ్యాన్స్‌కు సంబంధించింది. డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయిపై పక్కనే ఉన్న ఓ గుర్రానికి కోపమొచ్చింది. కోపంలో ఆ గుర్రం చేసిన పని చూస్తే..నవ్వాగదు. పాపం ఆ అమ్మాయి...


ఈ వీడియోలో అంతా స్పష్టంగా ఉంది. ఓ గుర్రం పచ్చిక తింటోంది. ఇంతలో ఓ అమ్మాయి అక్కడికి చేరుకుని డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తుంది. బ్యాక్‌డ్రాప్ మ్యూజిక్ ప్లే అవుతోంది. డ్యాన్స్ చేసే హుషారులో ఆ అమ్మాయి చేసిన పొరపాటు ఆ గుర్రానికి కోపం తెప్పించింది. డ్యాన్స్ చేస్తూ చేస్తూ..పొరపాటునో కావాలనో..గుర్రం వీపుపై అలా చేయేసింది. అంతే..గుర్రానికి కోపమొచ్చింది. తన మానాన తాను తిండి తింటుంటే..డిస్ట్రబ్ చేస్తావా అంటూ వెనక్కి తిరిగి ముఖభాగంతో ఒక్కటిచ్చింది. కాలితో తన్నేందుకు ప్రయత్నించింది. భయంతో ఆ అమ్మాయి పరుగు లంకించుకుంది. ఈ వీడియో చూస్తే నవ్వాగదు. పదే పదే చూడాలన్పించే వీడియో ఇది. మీరూ చూసి ఆనందించండి.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)


గమ్మత్తైన ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు భారీగా షేర్ చేస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాకు చెందిన వివిధ వేదికల్లో బాగా విస్తృతంగా వైరల్ అవుతోంది. 


Also read: Biggest Chicken: ప్రపంచంలోనే అతిపెద్ద కోడి.. బరువెంతో తెలుసా! ఎప్పుడూ చూసుండరు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook