Biggest Chicken: ప్రపంచంలోనే అతిపెద్ద కోడి.. బరువెంతో తెలుసా! ఎప్పుడూ చూసుండరు

3 Feet and 7.7 KG Brahma Chicken in Kosovo. 3 అడుగుల ఎత్తు, 7.7 కేజీల బరువు కోడి కూడా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద కోడిగా ఇది అనధికారికంగా పిలవబడుతోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 7, 2022, 03:50 PM IST
  • పంచంలోనే అతిపెద్ద కోడి
  • అతిపెద్ద కోడి బరువెంతో తెలుసా
  • ఎప్పుడూ చూసుండరు
Biggest Chicken: ప్రపంచంలోనే అతిపెద్ద కోడి.. బరువెంతో తెలుసా! ఎప్పుడూ చూసుండరు

Biggest Chicken In The World Video goes viral: మన దేశంలో ఉండే కోళ్లు సాధారణ బరువుతో ఉంటాయి. నాటు కోడి అయినా.. బాయిలర్ కోడి అయినా గరిష్టంగా 2 లేదా 3 కిలోల బరువు ఉంటాయి. గిరిరాజు లాంటి ప్రత్యేక రకానికి చెందినవి అయితే 3-4 కిలోలు వరకు ఉంటాయి. ఇలాంటి కోళ్లను మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే వీటన్నింటికి మించిన 3 అడుగుల ఎత్తున్న కోడి కూడా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద కోడిగా ఇది అనధికారికంగా పిలవబడుతోంది. ఈ కోడికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 

యూరప్ ఆగ్నేయాన ఉన్న కొసావోలో అతిపెద్ద కోడి ఉంది. దాపు 3 అడుగుల ఎత్తున్న బ్రహ్మ కోడి పుంజు తన గూట్లోంచి బయటకు వచ్చేప్పుడు మాములుగానే కనిపించింది. మొత్తం బయటికి వచ్చాక పెద్ద డైనోసార్ లాగా ఉంది. దాని రెక్కలు, కాళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఈ కోడి 3 అడుగుల ఎత్తు, 7.7 కేజీల బరువు ఉందట బ్రహ్మ జాతి కోళ్ల సగటు బరువు 5 కేజీలు ఉంటుందట. అయితే ఈ కోడి మాత్రం వాటి కంటే 2 కేజీల ఎక్కువ బరువు ఉంది. అంత బరువు ఉన్నా కూడా ఈ కోడి సునాయాసంగా నడుస్తోంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Animals Memes (@animals.hilarious)

ఈ కోడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఇది పాత వీడియోనే కానీ ఇన్‌స్టాగ్రామ్ పేజీ animals.hilariousలో బుధవారం పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన అందరూ షాకవుతున్నారు. ఈ వీడియోకి ఇప్పటికే 7 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. 38 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 'ప్రపంచంలోనే అతిపెద్ద కోడి', 'ఇలాంటి కోడిని ఎప్పుడూ చూసుండరు', 'ఇది కోడి కాదు డ్రాగన్', 'వామ్మో ఇదేం కోడిరా బాబు' అని కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీకి తెలుగు అభిమానుల స్పెషల్ బ‌ర్త్ డే గిఫ్ట్‌.. 41 అడుగుల భారీ కటౌట్!  

Also Read: Girl Stunt Video: ఏదో చెయ్యాలనుకుంటే.. ఇంకేదో అయింది! ఈ అమ్మాయి స్టంట్ చూస్తే మైండ్ బ్లాంకే  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News