ప్రపంచంలో ఉన్న పిల్లలందరికీ పాములంటే భయం ఉంటుంది. అది సహజం. కానీ 8 సంవత్సరాల ఈ ఇజ్రాయెల్ దేశ చిన్నారి మాత్రం 11 అడుగుల కొండచిలువతో చాలా స్నేహంగా ఉంటుంది. ఈ అమ్మాయి పేరు ఇంబర్. తన ఇంటి వెనకే ఉన్న నీటి కొలనులో కొండచిలువతో కలిసి ఈత కొడుతుంది. డిస్నీ మూవీ బ్యూటీ అండ్ బీస్ట్ ఆధారంగా తన పెంపుడు కొండచిలువకు బెల్లె అనే పేరు పెట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ|  Kids Using Smartphones: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? ఇలా చేయండి!


కరోనావైరస్ ( Coronavirus ) వల్ల స్కూల్స్ మూతబడటంతో ఇంటికే పరిమితం అయ్యాను అని.. తనకు అప్పటి నుంచి ఈ కొండచిలువ మంచి ఫ్రెండ్ అయింది అని తెలిపింది ఇంబర్. కొండచిలువతో ఉన్న సమయం చాలా సరదాగా ఉంటుంది అని..కొన్ని సార్లు దాన్ని తీసుకుని బయటికి వెళ్తానని చెబుతోంది.



బెల్లె కుటుంబం మంచి ధనిక కుటుంబం కావడంతో వారింట్లో యానిమల్ సాంక్చురి ఏర్పాటు చేసుకున్నారు. దాంతో పాటు వారు సరదాగా వ్యవసాయం ( Agriculture ) కూడా చేస్తుంటారు అని సమాచారం. 


చిన్నప్పటి నుంచి తన ఇంట్లో అనేక రకాల జంతువులను చూడటంతో  ఇంబర్ వాటితో ఆడుకోవడం ప్రారంభించిందట. చిన్నప్పుడే పాములతో కలిసి స్విమ్మింగ్ చేయడానికి వెళ్లేదని తల్లి సరిత్ రెగెవ్ తెలిపింది.


ALSO READ| Fake Smile: నకిలీ నవ్వు వల్ల ఎన్ని నష్టాలో తెలుసా ?


ఈ పాము ఇప్పుడు పెద్దది అవడంతో చూడటానికి కొంత మందికి అది భయంకరంగా అనిపించే అవకాశం ఉంది అని.. కానీ అది ప్రమాదకరం కాదంటోంది రెగేవ్. ఏమైనా కొండచిలువతో ఇంత దగ్గరిగా ఉండటం మంచిది కాదంటున్నారు నెటిజెన్స్ ( Netizens )


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR