Google vs Goats: ప్రపంచంలో తెలియని ప్రతి ప్రశ్నకు సమాధానం గూగుల్. నిత్య జీవితంలో అంతలా భాగమైన గూగుల్ మేకల్ని అద్దెకు తీసుకుందట. మేకలకు..గూగుల్‌కు సంబంధమేంటని ఆలోచిస్తున్నారా..నిజమే..చూద్దామా అదేంటో


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్య జీవితంలో ప్రతి అంశానికి మూలాధారంగా నిలుస్తున్న గూగుల్ అందరికీ సుపరిచితమైన పేరు. లే మ్యాన్ లాంగ్వేజ్‌లో అయితే గూగుల్ తల్లిని అడుగు అంటుంటాం. అంతలా భాగమైన గూగుల్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం ఇటీవల ట్రెండ్ అవుతోంది. అదేంటో చూద్దాం.


ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌కు సీఈవోగా ఉన్నది ఓ ఇండియన్. పేరు సుందర్ పిచాయ్. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటామనేదానిపై ఆధారపడి ఉంటుంది ఏ సంస్థ భవిష్యత్ అయినా. ఆ క్రమంలో తీసుకునే నిర్ణయాలు సిల్లీగా లేదా హాస్యాస్పదంగా అన్పించవచ్చు కానీ అవే సరైనవిగా తేలుతాయి ఆ తరువాత. అదే జరిగింది గూగుల్ విషయంలో. టెక్నాలజీలో ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ ఇటీవల 2 వందల మేకల్ని అద్దెకు తీసుకుందట. ఆశ్యర్యంగా ఉందా. గూగుల్‌కు మేకలకు సంబంధమేంటని ఆలోచిస్తున్నారా. ఇదేమీ జోక్ కాదు. నిజంగానే జరిగింది. కాలిఫోర్నియా గ్రేజింగ్ అనే కంపెనీ నుంచి ఓ రెండు వందల మేకల్ని గూగుల్ వారం రోజుల కోసం అద్దెకు తీసుకున్నారు. గూగుల్ సంస్థ ఆవరణలో..చుట్టూ భారీగా గడ్డి పెరిగిపోయిందట. ఈ గడ్డిని క్లీన్ చేసేందుకు మేకల్ని అద్దెకు తీసుకున్నారు. 


గడ్డి పెరిగితే సిబ్బందిని పెట్టి తొలగించుకోవచ్చు కదా..మేకల్ని అద్దెకు తీసుకోవడమేంటనే ప్రశ్న వస్తుంది అందరికీ. కూలీల్ని పెట్టి పని చేయించుకుంటే ఎక్కువ సమయం పడుతుంది. తిరిగి ఆ గడ్డిని మరో చోట తరలించాలి. అదే మేకల్ని పెట్టడం వల్ల వారం రోజుల్లోనే ఆ గడ్డిని మేకలు తినేశాయి. అంతేకాదు మేకల మలమూత్రాలతో ఆ ప్రాంతం ఫెర్టిలైజ్‌గా మారిపోయింది. సిల్లీ ఆలోచనే అయినా అద్బుతమైన ఫిలితాన్నిచ్చింది.


Also read: Viral Videos: పెళ్లి రిసెప్షన్​కు కుటుంబంతో హాజరైన ఎలుగుబంటి.. వీడియో వైరల్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook