Split Tongue Viral Video: ఇలాంటి వీడియో ఎప్పుడూ చూసుండరు.. ఒకేసారి రెండు వేర్వేరు పానీయాలు తాగుతున్న లేడీ!
Woman tastes Water and sprite at the same time. ఇటీవల నాలుకను రెండుగా చీల్చిన ఓ మహిళను చూసి నెటిజన్లు షాకవగా.. తాజాగా అలాంటి మరో వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
Woman split her tongue and tastes Water, sprite at the same time: టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి చాలా మంది ఇంటర్నెట్‌లో వింత వీడియోలను చూసి తెగ ఎంజాయ్ చేస్తారు. కొందరు ఫన్నీ వీడియోలు చూస్తే.. మరికొందరు జంతువులకు సంధించిన వీడియోస్ చూస్తారు. ఇంకొందరు ఆరోగ్యానికి సంబందించిన వీడియోలను చూడటానికి ఆసక్తి చూపిస్తే.. చాలామంది శరీర సవరణ వీడియోలను చూసి ఆశ్చర్యపోతారు. ఇటీవల నాలుకను రెండుగా చీల్చిన ఓ మహిళను చూసి నెటిజన్లు షాకవగా.. తాజాగా అలాంటి మరో వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
కాలిఫోర్నియాకు చెందిన బ్రియానా మేరీ షిహాదేహ్ అనే మహిళ ఒక డ్రెడ్‌లాక్ కళాకారిణి. ఆమెకు శరీర సవరణ పట్ల మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో బ్రియానా ఒకేసారి రెండు శీతల పానీయాల రుచి చూశారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. బ్రియానా ఒక గ్లాసులో స్ప్రైట్, మరొక గ్లాసులో నీరు పోశారు. ఆపై తన నాలుకను రెండుగా చీల్చి.. ఒకేసారి స్ప్రైట్, నీటి రుచులను చూశారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. బ్రియానా మేరీ షిహాదేహ్ తన నాలుకకు శస్త్రచికిత్స చేయించారు. దాంతో ఆమె నాలుక కొద్దిదూరం వరకు చీల్చి ఉంటుంది. అందుకే తన నాలుకను రెండుగా చీల్చి.. ఒకేసారి స్ప్రైట్, నీటి రుచులను చూడగలుగుతున్నారు. @flower.friendly అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బ్రియానాకు సంబందించిన వీడియో పోస్ట్ చేశారు. 'మీరు ముందుగా ఏ రెండు రుచులను టెస్ట్ చేస్తారు' అని క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియో ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1,76,000 మంది వ్యూస్ వచ్చాయి. బ్రియానా మేరీ ఏకకాలంలో రెండు పదార్థాలు తాగడం చూసిన ప్రజలు ఆశ్చర్యపోవడంతో దీనికి 13,000కు పైగా లైక్‌లు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు మహిళ నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఈ ప్రక్రియ ఆమెను బాధించిందా అని ప్రశ్నిస్తున్నారు. నేను దీనిని ప్రయత్నిస్తా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.