Chennai Super Kings CEO Kasi Viswanathan reacts about Ambati Rayudu IPL Retirement: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు తాను అల్విదా పలుకుతున్నా అని ట్వీట్ చేసి.. ఆపై డిలీట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, తెలుగు తేజం అంబటి రాయుడు అభిమానులను గందరగోళానికి గురిచేశాడు. దీంతో ఇప్పుడు రాయుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చేపినట్టా లేదా అని ఫాన్స్ అందరూ అయోమయంలో ఉన్నారు. ట్వీట్ ద్వారా రాయుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కావట్లేదంటూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ స్పందించింది.
శనివారం మధ్యాహ్నం అంబటి రాయుడు ఒక ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'ఇది నా చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. 13 సంవత్సరాలుగా మెగా టోర్నీతో నా అనుబంధం కొనసాగింది. రెండు గొప్ప జట్లలో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు కృతజ్ఞతలు' అని రాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. అయితే ఆ ట్వీట్‌ను అతడు కాసేపటికి డిలీట్ చేశాడు.
అంబటి రాయుడు డిలీట్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఇంతకు తెలుగు తేజం ఐపీఎల్‌కు గుడ్‌బై చేపినట్టా లేదా అని ఫాన్స్ గందరగోళానికి గురయ్యారు. చెన్నై సీఈఓ విశ్వనాథ్ దీనిపై స్పందించి ఓ క్లారిటీ ఇచ్చారు. 'నేను అంబటి రాయుడుతో మాట్లాడా. అతడు రిటైర్ అవ్వట్లేదు. ఐపీఎల్ 2022లో తన ఆటతీరుపై అసంతృప్తిగా ఉన్నాడు. కొంత సైకలాజికల్ డిస్టర్బెన్స్‌కు గురై ఉంటాడు. అందుకే రాయుడు ఆ ట్వీట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేశాడు. కచ్చితంగా అతడు రిటైర్ అవ్వట్లేదు. రాయుడికి ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా అందిస్తాం' అని విశ్వనాథ్ తెలిపారు.
2019 ప్రపంచకప్ సమయంలో భారత జట్టుకు అంబటి రాయుడును ఎంపిక చేయకపోవడంతో.. అతడు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. రాయుడు ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 271 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 78 కాగా.. స్ట్రైక్ రేట్ 124.31గా ఉంది. ఇక 2010 సీజన్‌లో ఐపీఎల్ టోర్నమెంట్‌లో అడుగు పెట్టిన రాయుడు ఇప్పటివరకు 187 మ్యాచ్‌లు ఆడి 4187 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 100.
Also Read: Vivo Y53S Amazon: రూ.23 వేల విలువైన Vivo స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ.3 వేలకే కొనండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.