SVP Day 2 Collections, Sarkaru Vaari Paata movie Day 2 collections: గురువారం (మే 12) విడుదలైన టాలీవుడ్ 'సూపర్ స్టార్' మహేశ్ బాబు తాజా సినిమా 'సర్కారు వారి పాట' రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఎస్వీపీ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. 'బాబు ల్యాండ్ అయితే బాక్సాఫీస్‌కు బ్యాండే' అన్న అభిమానుల మాటలను నిజం చేస్తూ.. మహేశ్ బాబు తన సత్తాచాటుతున్నారు. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.36.36 కోట్ల కలెక్షన్స్ వసూల్ చేసిన ఎస్వీపీ సినిమా.. రెండో రోజు కూడా అదే జోష్‌ను కనబరిచింది.
శుక్రవారం 'సర్కారు వారి పాట' సినిమా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ.11.64 కోట్లను వసూలు చేసింది. తాజా తాజా అప్ డేట్ ప్రకారం.. నైజాంలో రూ.5.2 కోట్లు, సీడెడ్ 1.45 కోట్లు, ఉత్తరాంధ్ర 1.65 కోట్లు, ఈస్ట్ 1.08 కోట్లు, వెస్ట్ 45 లక్షలు, గుంటూరు 51 లక్షలు, కృష్ణ 89 లక్షలు, నెల్లూరులో 41 లక్షను వసూలు చేసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ.48.27 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈరోజుతో రూ.50 కోట్ల క్లబ్లో చేరనుంది.
ఎస్వీపీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 36.63 కోట్ల కలెక్షన్స్ వసూల్ చేసింది. అత్యధికంగా నైజాంలో రూ.12.24 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. గుంటూరులో రూ.5.83 కోట్లు, సీడెడ్‌లో రూ.4.7 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.3.73 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.3.25 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.3 కోట్లు, కృష్ణాలో రూ.2.58 కోట్లు, నెల్లూరులో రూ.1.56 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అమెరికాలో కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. రెండు రోజుల్లో 1.5 మిలియన్స్ డాలర్లను కలెక్ట్ చేసి సత్తా చాటింది.
ఫ్యామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమాను జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేశ్ నటించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో సముద్రఖని, నదియా, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ, యాక్షన్‌తో ఎస్వీపీ తెరకెక్కింది.
Also Read: Ambati Rayudu Retirement: అంబటి రాయుడు షాకింగ్ నిర్ణయం.. ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ పోస్ట్!
Also Read: Virat Kohli: ఓరి దేవుడా.. నేను ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు! విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook